https://oktelugu.com/

Prabhas: ఓ ఇంటివాడు కాబోతున్న ప్రభాస్​.. ఆ ప్రాంతంలో కోటలాంటి భవన నిర్మాణానికి ఏర్పాట్లు?

Prabhas: టాలీవుడ్​లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్​లర్​ పాన్​ ఇండియా హీరోగా ఉన్న వ్యక్తి ప్రభాస్​. తాజాగా ఆయన వివాహం గురించి ఆసక్తికర అప్​డేట్ వినిపిస్తోంది. ప్రభాస్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నట్లు సమాచారం. అయితే, చాలా మంది పెళ్లి చేసుకుని ఇళ్లు కట్టుకుంటే.. ప్రభాస్​ ఇళ్లు కట్టుకుని.. తర్వాత పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్లున్నాడు. అందుకే, హైదరాబాద్​లో కొత్త ఇళ్లు కట్టుకుని.. ప్రభాస్​ ఓ ఇంటివాడు కానున్నాడట. ప్రస్తుతం ముంబయిలో ప్రభాస్​కు సొంత ఇళ్లు ఉండగా.. తాజాగా హైదరాబాద్​లోని […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 10, 2021 / 04:05 PM IST
    Follow us on

    Prabhas: టాలీవుడ్​లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్​లర్​ పాన్​ ఇండియా హీరోగా ఉన్న వ్యక్తి ప్రభాస్​. తాజాగా ఆయన వివాహం గురించి ఆసక్తికర అప్​డేట్ వినిపిస్తోంది. ప్రభాస్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నట్లు సమాచారం. అయితే, చాలా మంది పెళ్లి చేసుకుని ఇళ్లు కట్టుకుంటే.. ప్రభాస్​ ఇళ్లు కట్టుకుని.. తర్వాత పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్లున్నాడు. అందుకే, హైదరాబాద్​లో కొత్త ఇళ్లు కట్టుకుని.. ప్రభాస్​ ఓ ఇంటివాడు కానున్నాడట. ప్రస్తుతం ముంబయిలో ప్రభాస్​కు సొంత ఇళ్లు ఉండగా.. తాజాగా హైదరాబాద్​లోని నానక్​రామ్​కూడ సినీ విలేజ్​లో విల్లాను నిర్మిస్తున్నట్లు సమాచారం.

    Prabhas

    హైదరాబాద్ నగరంలోని హాట్‌స్పాట్‌లలో ఒకటైన నానక్‌రామ్‌గూడలో  ఔట‌ర్ రింగ్ రోడ్డుకు ద‌గ్గ‌ర‌లోరూ.  120 కోట్లతో రెండు ఎక‌రాలు కొన్నట్లు తెలుస్తోంది. విమానాశ్రయానికి దగ్గరగా ఉండటంతో, ట్రాఫిక్ కూడా పెద్దగా లేకపోవడం వల్ల ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నాడట ప్రభాస్​. గెస్ట్ లేదా బంగ్లాను కట్టాలని అనుకుంటున్నట్లు సమాచారం. అత్యాధునిక సౌకర్యాలతో కోటలాంటి హాలిడే హోమ్​ను ఇక్కడ ఏర్పాటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

    Also Read: ప్రభాస్ “ప్రాజెక్ట్ కే” అప్డేట్… ఫుల్ జోష్ లో డార్లింగ్ అభిమానులు

    కాగా, ప్రభాస్​ ప్రస్తుతం రాధేశ్యామ్ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్​గా కనిపించనుంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్​, పాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు సలార్, ఆదిపురుష్​ చిత్రాల్లోనూ నటిస్తున్నారు ప్రభాస్​. ఆదిపురుష్​ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్​ పనుల్లో ఉండగా.. సలార్ సినమా షూటింగ్ నడుస్తోంది.

    Also Read: మరో అరుదైన ఘనత సాధించిన ప్రభాస్… ఆసియా లోనే నెం.1