https://oktelugu.com/

RRR Movie: ప్రెస్ మీట్ లో పునీత్ సాంగ్ పాడుతూ ఎమోషనల్ అయిన జూనియర్ ఎన్టీఆర్…

RRR Movie: దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమా లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. తెలుగులో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ సినిమాగా దీన్ని తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. భారీ బడ్జెట్ తో డివివి దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీపై  ఇప్పటికే అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. ఈ చిత్రం జనవరి 7వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీగా […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 10, 2021 / 04:21 PM IST
    Follow us on

    RRR Movie: దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమా లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. తెలుగులో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ సినిమాగా దీన్ని తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. భారీ బడ్జెట్ తో డివివి దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీపై  ఇప్పటికే అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. ఈ చిత్రం జనవరి 7వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. ఈ సినిమాలో తారక్​ భీమ్​గా కనిపించనుండగా.. చరణ్​ అల్లూరి సీతారామరాజు పాత్రలో దర్శనమివ్వనుననారు. ఈ చిత్రం కి సంబంధించిన ట్రైలర్ ను తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. అన్ని భాషల్లో ఈ ట్రైలర్ కి భారీ రెస్పాన్స్ వస్తోంది.

    young tiger ntr got emotional while singing puneeth raj kumar song

    Also Read: “ఆర్‌ఆర్‌ఆర్” మూవీ ఓటీటీ రిలీజ్ పై క్లారిటి ఇచ్చిన మూవీ యూనిట్…

    కాగా ఆర్ఆర్ఆర్ మూవీ టీమ్ ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. అంతేకాక ప్రెస్ మీట్ ద్వారా ప్రేక్షకులకి మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది చిత్ర బృందం. తాజాగా బెంగళూరు లో జరిగిన ప్రెస్ మీట్ లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్, నిర్మాత డివివి దానయ్య, డైరెక్టర్ రాజమౌళి హాజరయ్యారు. ఈ సమావేశం లో జూనియర్ ఎన్టీఆర్ దివంగత కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ను గుర్తు చేసుకొని ఎమోషనల్ అయ్యారు. గతంలో పున్నెత్ రాజ్ కుమార్ నటించిన ఒక సినిమాలో గెలెయా గెలెయా అనే పాటను తారక్ పాడిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సంధర్బంగా పునీత్ గౌరవార్ధం ఈ సాంగ్ ను ఎన్టీఆర్ మళ్ళీ ఆలపించారు. అంతేకాక ఇకపై తను ఈ పాటను ఇంకెక్కడ పాడను అంటూ భావోద్వేగం అయ్యారు జూనియర్ ఎన్టీఆర్. పునీత్ ఎక్కడ ఉన్నా, ఆయన ఆశీర్వాదం ఎప్పుడూ మాపై ఉండాలి అంటూ తెలిపారు.

    Also Read: ఆర్ఆర్ఆర్ హిందీ ట్రైలర్ లాంచింగ్ లో ఎన్టీఆర్ దుమ్ముదులిపాడు