https://oktelugu.com/

Tejaswi Madivada: “సర్కస్ కార్ 2” చిత్రంలో హీరోయిన్ గా ఎంపికైన తేజస్వి మాదివాడ…

Tejaswi Madivada:  సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకుంది “తేజస్వి మాదివాడ’. ఈ మూవీలో ఆమె భాష, యాసకు మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత వరసగా సినిమా ఆఫర్లు రావడంతో బిజీ అయిన ఈ అమ్మడు… మంచి రోల్స్ పోషించి ప్రేక్షకులకు దగ్గరైంది. మళ్లీ మళ్లీ ఇది రాని రోజు మూవీలో మంచి పాత్ర పోషించింది. ఇప్పుడు తాజాగా నల్లబిల్లి వెంకటేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “సర్కస్ కార్ 2” చిత్రంలో హీరోయిన్ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 10, 2021 / 04:03 PM IST
    Follow us on

    Tejaswi Madivada:  సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకుంది “తేజస్వి మాదివాడ’. ఈ మూవీలో ఆమె భాష, యాసకు మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత వరసగా సినిమా ఆఫర్లు రావడంతో బిజీ అయిన ఈ అమ్మడు… మంచి రోల్స్ పోషించి ప్రేక్షకులకు దగ్గరైంది. మళ్లీ మళ్లీ ఇది రాని రోజు మూవీలో మంచి పాత్ర పోషించింది. ఇప్పుడు తాజాగా నల్లబిల్లి వెంకటేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “సర్కస్ కార్ 2” చిత్రంలో హీరోయిన్ గా ఎంపికయ్యారు. సర్కస్ కార్ సినిమాకి సీక్వెల్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తుండగా… బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి, మస్త్ అలీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ప్రెస్టేజ్ ఫ్రేమ్స్ పతాకంపై శివరాజు వికె ఈ క్రేజీ హారర్ ఎంటర్టైనర్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం తూర్పు గోదావరిలోని మారేడుమిల్లి అడవుల్లో షూటింగ్ జరుపుకుంటోంది.

    actress tejaswi madivada playing lead role in circus car 2 movie

    Also Read: “డిటెక్టివ్ సత్యభామ” గా రానున్న సోనియా అగర్వాల్…

    ఈ సందర్భంగా తేజస్వి మదివాడ మాట్లాడుతూ… “నల్లబిల్లి వెంకటేష్ డైరెక్షన్ లో వచ్చిన సర్కస్ కార్ చూశాను, నాకు చాలా బాగా నచ్చింది. ఆ చిత్రం సీక్వెల్ లో నటించే అవకాశం రావడం చాలా హ్యాపీగా ఉంది. సీక్వెల్ స్టోరీ కూడా చాలా గ్రిప్పింగ్ గా ఉంది. సర్కస్ కార్ 2 లో నటించే అవకాశం ఇచ్చిన నిర్మాత శివరాజ్ గారికి థాంక్స్” అని అన్నారు. అలానే ప్రెస్టేజ్ ఫ్రేమ్స్ అధినేత శివరాజు వి.కె మాట్లాడుతూ … భయంతో కూడిన వినోదాన్ని పంచే సర్కస్ కార్ 2 మా దర్శకుడు నల్లబిల్లి వెంకటేష్, తేజస్వి మదివాడ, అషు రెడ్డిలకు చాలా మంచి పేరు తెస్తుంది” అని అన్నారు. బేబి శ్రీదేవి, మాస్టర్ రోషన్, మాస్టర్ ధృవ్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి పి.ఆర్.ఓ గా ధీరజ్ అప్పాజీ చేస్తుండగా… చైతన్య సంగీతం సమకూరుస్తున్నారు. ఇక ఎడిటింగ్ బాధ్యతలను గౌతమ్ కుమార్… కెమెరామెన్ గా జి.ఎస్.చక్రవర్తి రెడ్డి చేస్తున్నారు.

    Also Read: కోలీవుడ్​లో హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకోనున్న మంచు విష్ణు