https://oktelugu.com/

OTT: ఆ మల్టీస్టారర్ థియేటర్స్ లో డిజాస్టర్, ఓటీటీలో డబుల్ డిజాస్టర్! కారణం?

OTT: అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా బడే మియా చోటే మియా తెరకెక్కింది. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 10న విడుదల చేశారు.

Written By:
  • S Reddy
  • , Updated On : June 10, 2024 / 07:09 PM IST

    Bade Miyan Chote Miyan Double Disaster in OTT

    Follow us on

    OTT: ఇద్దరు బడా హీరోలతో నటించిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ డిజాస్టర్ అయ్యింది. ఈ చిత్రం ఓటీటీలో కూడా కనీస ఆదరణను నోచుకోవడం లేదు. అక్షయ్ కుమార్ కి కాలం కలిసి రావడం లేదు. ఆయన హిట్ కొట్టి చాలా ఏళ్ళు అవుతుంది. ఒకప్పుడు వరుస హిట్స్ ఇచ్చిన అక్షయ్ కుమార్ పరిస్థితి దారుణంగా మారింది. మరోవైపు టైగర్ ష్రాఫ్ పరిస్థితి కూడా అలానే ఉంది. వీరిద్దరి కాంబోలో వచ్చిన బడే మియా చోటే మియా మరో డిజాస్టర్ గా నిలిచింది.

    అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా బడే మియా చోటే మియా తెరకెక్కింది. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 10న విడుదల చేశారు. దాదాపు రూ. 350 కోట్ల బడ్జెట్ తో రూపొందించిన ఈ చిత్రం కనీసం రూ. 100 కోట్లు కూడా రాబట్టలేకపోయింది. అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ విపరీతంగా సినిమాను ప్రమోట్ చేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. కఠినమైన యాక్షన్ ఎపిసోడ్స్ లో వారిద్దరూ పాల్గొన్నారు. సినిమా కోసం చాలా కష్టపడ్డారు.

    థియేటర్స్ లో దారుణ ఫలితం చూసినప్పటికీ ఓటీటీలో ఆదరణ లభిస్తుంది అంటుకుంటే… అక్కడ డబుల్ డిజాస్టర్ అయ్యింది బడే మియా చోటే మియా. ఈ మూవీ డిజిటల్ రైట్స్ ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. జూన్ 6 నుండి ఈ చిత్రం నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది.

    ఓటీటీలో బడే మియా చోటే మియా చిత్రాన్ని పట్టించుకున్న నాథుడు లేడు. టాప్ 10 నెట్ఫ్లిక్స్ చిత్రాల్లో బడే మియా చోటే మియాకు చోటు దక్కలేదు. నెట్ఫ్లిక్స్ ప్రతినిధులు సైతం తీవ్ర నిరాశలో ఉన్నారు. బడే మియా చోటే మియా చిత్రంలో విలన్ గా సలార్ ఫేమ్ పృథ్విరాజ్ సుకుమారన్ నటించారు. మానుషీ చిల్లర్, అల్యా ఎఫ్ హీరోయిన్స్ గా నటించారు. సోనాక్షి సిన్హా గెస్ట్ రోల్ చేసింది. అలీ అబ్బాస్ జాఫర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.