Bad news for OG fans: నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్ షోస్ ద్వారా ఓజీ (They Call Him OG) చిత్రం గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డు స్థాయిలో జరుగుతున్నాయి. కంటెంట్ డెలివరీ విషయం లో చివరి వరకు బయ్యర్స్ ని మేకర్స్ టెన్షన్ పెట్టారు కానీ, అనుకున్న సమయానికే కంటెంట్ ని చేర్చడం తో ప్రీమియర్స్ కి ఎక్కడా ఆటంకం కలగకుండా బుకింగ్స్ ని మొదలు పెట్టారు. ట్రేడ్ పండితులు అందిస్తున్న లెక్కల ప్రకారం ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 82 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఫైనల్ అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ కచ్చితంగా వంద కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందని ఆశిస్తున్నారు పవన్ ఫ్యాన్స్. కాసేపటి క్రితమే హైదరాబాద్, బెంగళూరు మరియు ఇతర ప్రధాన సిటీస్ లో నేషనల్ మల్టీప్లెక్స్ చైన్స్ అడ్వాన్స్ బుకింగ్స్ ని మొదలు పెట్టారు.
వీటికి ఫ్యాన్స్ నుండి మామూలు రేంజ్ రెస్పాన్స్ రాలేదు. ఇప్పుడే బుకింగ్స్ మొదలు పెట్టారు కాబట్టి, ఇవి ఏ రేంజ్ కి వెళ్తాయి అని చెప్పడానికి సాయంత్రం వరకు ఆగాల్సిందే. హైదరాబాద్ లో అయితే ప్రీ సేల్స్ ద్వారా ఆల్ టైం రికార్డు గ్రాస్ ని ఈ చిత్రం నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే అసలు సెకండ్ హాఫ్ కంటెంట్ ని అంత ఆలస్యంగా పంపడానికి కారణం ఏమిటి? అనే విషయాన్నీ పరిశీలిస్తే, సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలను ట్రిమ్ చేశారట. వాటిల్లో ఈ చిత్రానికి సాహూ చిత్రానికి కనెక్షన్ ఉన్న సన్నివేశాన్ని కూడా తీసేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే సుజిత్ కి ఆ సన్నివేశం ఎందుకో ఇరికించి పెట్టినట్టుగా అనిపించిందట. అందుకే ఆయన తొలగించినట్టు చెప్తున్నారు. ఇది ప్రభాస్, పవన్ కళ్యాణ్ మ్యూచువల్ అభిమానులకు కాస్త నిరాశ కలిగించే విషయమే. కానీ సినిమాలో ఇలాంటి సన్నివేశాలు ఉండడం వల్ల మొదటి రోజు ఆడియన్స్ ఈలలు వేసి ఎంజాయ్ చేయొచ్చేమో కానీ ఫుల్ రన్ లో చూసే ఆడియన్స్ మాత్రం అవసరమా ఇది అని కచ్చితంగా అనిపించే ప్రమాదం ఉంది.
ఇక ఈ సినిమా రిపోర్ట్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ లో పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) సన్నివేశాలు భారీ ఎలివేషన్స్ తో అద్భుతంగా వచ్చాయట. ఫ్యాన్స్ కి అవి ఫుల్ మీల్స్ లెక్క ఉంటాయని అంటున్నారు. అదే విధంగా సెకండ్ హాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ మరియు ఎమోషన్స్ కూడా బాగా వర్క్ అవుట్ అయ్యాయి అని, క్లైమాక్స్ చాలా కొత్తగా, హై లెవెల్ స్టాండర్డ్స్ తో ఉంటాయని, కచ్చితంగా ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకం తో ఉన్నారు మేకర్స్. మరి ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అనేది చూడాలి.