Trivikram Srinivas: టాలీవుడ్ ని పాన్ ఇండియా మోజు ఊపేస్తోంది. బాహుబలి సక్సెస్ తర్వాత మొదలైన ఈ ట్రెండ్ పుష్ప విజయంతో మరింత పుంజుకునే సూచనలు కనిపిస్తున్నాయి. పుష్ప విడుదలకు ముందే మన స్టార్ దర్శకులలో కొందరు పాన్ ఇండియా చిత్రాలకు సిద్ధమయ్యారు. దర్శకధీరుడు రాజమౌళి వేసిన దారిని తెలుగు సినిమాకు రహదారిగా మార్చే పనిలో ఉన్నారు. పుష్ప సక్సెస్ తో రాజమౌళి తర్వాత బాలీవుడ్ లో విజయం సాధించిన డైరెక్టర్ గా సుకుమార్ రికార్డులకు ఎక్కారు.

అలాగే డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ హిందీ చిత్రాలకు కూడా దర్శకత్వం వహించారు. ఆయన బిగ్ బి అమితాబ్ తో బుడ్డా హోగా తేరా బాప్ అనే చిత్రం చేశారు. ఇక లైగర్ మూవీతో పాన్ ఇండియా దర్శకుడిగా మారనున్నారు. కొరటాల శివ ఎన్టీఆర్ 30వ చిత్రంతో , క్రిష్ హరి హర వీరమల్లు మూవీతో… హిందీ బెల్టులో తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు. దర్శకుడు త్రివిక్రమ్ ఈ విషయంలో వెనుకబడ్డారనిపిస్తుంది. అరవింద సమేత, అల వైకుంఠపురంలో వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుని స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ లో టాప్ 3 లో ఉన్న త్రివిక్రమ్ ఈ దిశగా ఆలోచన చేయకపోవడం ఆశ్చర్యం వేస్తుంది.
Also Read: ‘కార్తి’తో రొమాన్స్ కి సమంత రెడీ !
అదే సమయంలో త్రివిక్రమ్ చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధిస్తాయా అనే సందేహం కలుగుతుంది. ఎందుకంటే త్రివిక్రమ్ మన తెలుగు నేటివిటీని ప్రతిబింబించేలా కుటుంబ కథా చిత్రాలు చేస్తారు. త్రివిక్రమ్ చిత్రాలను నిశితంగా పరిశీలిస్తే 70ల నాటి కథలకు జస్ట్ మోడ్రన్ టచ్ ఇచ్చినట్లు ఉంటాయి. ఫ్యామిలీ ఎమోషన్స్ కి తన మార్కు మాటలు జోడించి తెలుగు ప్రేక్షకులను కట్టిపడేస్తాడు. కథలు చాలా సాదాసీదా ఉంటాయి. త్రివిక్రమ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచిన అత్తారింటికి దారేది, అల వైకుంఠపురంలో చిత్రాలు పూర్తిగా కుటుంబ కథా చిత్రాలు.

ఈ తరహా సబ్జక్ట్స్ పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధిస్తాయా…? మన తెలుగు నేటివిటీతో కూడిన కథలు, నేపధ్యాలూ హిందీ జనాలకు ఎక్కుతాయా? అంటే అనుమానమే. ఒక భాషలో విజయం సాధించిన చిత్రాలు మరొక భాషలో అట్టర్ ప్లాప్ అయిన సందర్భాలు అనేకం. కారణం నేటివిటీ, అలాగే నేపథ్యంలో ఉన్న తారతమ్యాలు.
పాన్ ఇండియా చిత్రాల నేపథ్యం యూనివర్సలై ఉండాలి. అన్ని భాషల, ప్రాంతాల ప్రజలకు ఎక్కే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. త్రివిక్రమ్ చిత్రాలకు ఇది పెద్ద మైనస్ కాగా, తన మార్కు కథలతో అక్కడ ఆయన విజయం సాధిస్తారా? అనేది ఒక ప్రశ్న. దీనికి సమాధానం అల వైకుంఠపురంలో చిత్రంతో దొరకవచ్చు. అల వైకుంఠపురంలో మూవీ ఫిబ్రవరి 6న హిందీ వర్షన్ థియేటర్స్ లో విడుదల అవుతుంది. దీని సక్సెస్ ఆధారంగా త్రివిక్రమ్ పాన్ ఇండియా భవిష్యత్ అంచనా వేయవచ్చు.
Also Read: ఎక్స్ గ్రేషియా వద్దు.. నిందితుడిని కఠినంగా శిక్షించాల్సిందే..
[…] Also Read: వెనుకబడ్డ త్రివిక్రమ్… అదే ఆయనకు పెద… […]