Ala Vaikunthapurramuloo: తెలుగు సినిమాలను హిందీ యూట్యూబ్ ప్లాట్ ఫామ్స్ లో రిలీజ్ చేస్తూ ఫుల్ క్యాష్ చేసుకోవడంలో గోల్డ్‌మైన్స్ నిర్మాత మనీష్ షా చాలా బాగా ఆరితేరిపోయాడు. అలాగే మనీష్ షా తెలుగు సినిమాలను కొని పెద్ద నిర్మాత కూడా అయిపోయాడు. పైగా తెలుగు సినిమాలకు హిందీ యూట్యూబ్ ప్లాట్ ఫామ్స్ లో ఫుల్ గిరాకీ ఉంది. ఈ క్రమంలో హిందీలో ‘పుష్ప’ రైట్స్ కొనుగోలు చేసి మనీష్ షా మంచి లాభాలను అందుకున్నాడు.

కాగా అల్లు అర్జున్ ఇండస్ట్రీ హిట్ అయిన అల వైకుంఠపురములో హిందీ వెర్షన్ ను తానే కొనుగోలు చేశాడు. అయితే, అల వైకుంఠపురములో హిందీ వెర్షన్‌ను ఫిబ్రవరి 6, 2022న విడుదల చేయనున్నట్లు ముందుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ, ఇప్పుడు ఫిబ్రవరి 13, 2022న విడుదల చేయనున్నట్లు సరికొత్త తేదీని వదిలారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటించింది.
Also Read: నదుల అనుసంధానానికి కేంద్రం అడుగులు.. తెలుగు రాష్ట్రాలపై ప్రభావం..
ఈ సినిమా విజయంలో తమన్ తన సంగీతంతో ప్రధాన పాత్ర పోషించాడు. మొత్తానికి మనీష్ షా వరుస హిట్లు అందుకుంటున్నాడు. అందుకే, ఆ విజయాల కిక్ లో బాలీవుడ్ డైరెక్టర్లపై నిన్న సంచలన వ్యాఖ్యలు చేశాడు. మనీష్ షా మాటల్లోనే.. ‘మా దర్శకులు అంధేరి-బాంద్రా మధ్యే ఉంటున్నారు. అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ చూస్తూ.. ఇండియా మొత్తం ఆ రెండు ప్రాంతాల మధ్యే ఉంటుందని భావిస్తున్నారు.

అందుకే వాళ్లు పుష్పలాంటి మంచి యాక్షన్ సినిమాలు చేస్తారని మీరు ఆశించకండి’ అని అన్నాడు. మొత్తానికి బాలీవుడ్ డైరెక్టర్లపై పుష్ప హిందీ డబ్బింగ్ నిర్మాత ఈ రేంజ్ కామెంట్స్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఏది ఏమైనా తెలుగు హిట్ చిత్రాలను యూట్యూబ్‌లో డబ్బింగ్ చేసి అమ్ముకునే స్థాయి నుంచి.. ఇప్పుడు నేరుగా థియేటర్లలో విడుదల చేసే స్థాయికి వచ్చాడు గోల్డ్‌మైన్స్ నిర్మాత మనీష్ షా.
Also Read: షాకింగ్ నిజాల మధ్యన ‘రామ సేతు’ సాగుతుంది – అక్షయ్ కుమార్