Manjusha background: సమంత ప్రధాన పాత్ర పోషించిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై బంపర్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంది. టాక్ కూడా చాలా పాజిటివ్ గా రావడంతో ఈ వీకెండ్ తో బ్రేక్ ఈవెన్ మార్కు ని అందుకుంటుందని బలమైన నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు బయ్యర్స్. ఈ సినిమాలో సమంత నటనకు ఎంతటి అద్భుతమైన మార్కులు వచ్చాయో, ఆమెతో పాటు కలిసి నటించిన మంజూష ముక్కవల్లి కి కూడా అదే స్థాయి మార్కులు వచ్చాయి. ఈ చిత్రం లో ఆమె నటనపై , కామెడీ టైమింగ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు నెటిజెన్స్. ఇంతకు ముందు ఈ నటిని ఎక్కడా చూడలేదు, ఇంత బాగా నటించింది , అసలు ఎవరు ఈమె? , ఎక్కడి నుండి వచ్చింది? అంటూ ఈమె గురించి వివరాలను తెలుసుకోవడం కోసం సోషల్ మీడియా ని తెగ గాలిస్తున్నారు నెటిజెన్స్.
అందరూ అనుకుంటున్నట్టుగా ఈమె తమిళ సినిమా ఇండస్ట్రీ నుండో , లేదా వేరే ఏ ఇతర ఇండస్ట్రీ నుండో వచ్చిన ఆర్టిస్ట్ కాదు. ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్ ద్వారా బాగా పాపులారిటీ ని సంపాదించిన ఒక సామాన్యురాలు మాత్రమే. లెజండరీ నటీమణులు సూర్యకాంతం, ఛాయాదేవి , నిర్మలమ్మ వంటి వారిని ఇమిటేట్ చేస్తూ , వాళ్ళ మ్యానరిజమ్స్ ని మక్కీకి మక్కీ దింపుతూ ఎన్నో వందల రీల్స్ చేసింది. వాటికి రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చాయి. అలా బాగా పాపులర్ అయినా ఈమెని సమంత మరియు నందిని రెడ్డి టీం గుర్తించి, ఈ చిత్రం లో సమంత కి స్నేహితురాలి పాత్రకు ఎంచుకున్నారు. తనకు వచ్చిన ఈ అద్భుతమైన అవకాశాన్ని ప్రతీ ఫ్రేమ్ లో చక్కగా ఉపయోగించుకుంది మంజూష. సమంత తో పోటీపడి మరీ నటించి అందరి దృష్టిని ప్రత్యేకించి ఆకర్షించింది.
మంజూష ముక్కవల్లి కి సంబంధించిన ఇన్ స్టాగ్రామ్ ప్రొఫైల్ ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి. ఆమె రీల్స్ కాసేపు చూస్తే చాలు , వేరే ప్రపంచం లోకి వెళ్ళిపోతారు , మంచి ఎంటర్టైన్మెంట్ ని పొందుతారు. మొదటి సినిమాతోనే అద్భుతంగా ప్రేక్షకులను అలరించిన మంజూషాకు రాబోయే రోజుల్లో కచ్చితంగా సినిమా అవకాశాలు భారీగానే వస్తాయి, అందులో ఎలాంటి సందేహం లేదు , ఇలాంటి గొప్ప టాలెంట్ ఉన్నటువంటి అమ్మాయిని ప్రోత్సహించి ఇండస్ట్రీ లోకి తీసుకొచ్చినందుకు సోషల్ మీడియా లో సమంత మరియు నందిని రెడ్డి లకు కృతఙ్ఞతలు చెప్తున్నారు నెటిజెన్స్.
