Homeఎంటర్టైన్మెంట్Deewana Movie Review: 'దివానా ' ఫుల్ మూవీ రివ్యూ...హిట్టా?ఫట్టా..?

Deewana Movie Review: ‘దివానా ‘ ఫుల్ మూవీ రివ్యూ…హిట్టా?ఫట్టా..?

Deewana Movie Review: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. ఇక ఇలాంటి క్రమంలోనే స్టార్ హీరోలు పాన్ ఇండియాలో పెను సంచలనాలను క్రియేట్ చేస్తుంటే కుర్ర హీరోలు మాత్రం ప్రేమకథ చిత్రాలతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే శ్రీకాంత్ సంగిశెట్టి అనే దర్శకుడు ‘దివానా’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఎలా ఉంది సగటు ప్రేక్షకుడిని మెప్పించిందా? లేదా అనే విషయాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

కథ

మున్నా (హర్షిత్ రెడ్డి) అనే ఒక అకతయిగా తిరిగే కుర్రాడు అమూల్య (స్నేహ మణి మేఘాలై) అనే ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. తన ప్రేమను పొందడానికి చిత్ర విచిత్రాలు చేస్తూ ఎలాగైనా సరే తనని ఆకర్షించాలనే ప్రయత్నం చేస్తుంటాడు. ఈ క్రమంలోనే అమూల్యను ఏడిపించిన కొంతమందిని కొట్టి జైలుకి కూడా వెళ్తాడు. తనకోసం ఏది చేయడానికైనా సిద్ధంగా ఉన్నానంటూ తనకు తెలిసేలా చెప్పే ప్రయత్నం చేస్తుంటాడు. ఫ్యూచర్ మీద ఎలాంటి ప్లానింగ్ లేకుండా అల్లరి చిల్లరగా తిరుగుతున్న హీరోని పేరెంట్స్ ఇంట్లో నుంచి బయటకు వెళ్లగొడతారు. అలాగే ఆయనకి ఉన్న గోల్ ఏంటి? హీరోయిన్ ను పొందడానికి ఆమె అతనికి పెట్టిన కండిషన్ ఏంటి? ఆ కండిషన్ లో తను ఎంతవరకు విజయం సాధించాడు? ఫైనల్ గా మున్నా, అమూల్య ఇద్దరు ఒకటయ్యారా? లేదా అనేది తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…

విశ్లేషణ

దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి ఈ సినిమాని మొదటి నుంచి ఒక ప్యూర్ లవ్ స్టోరీ గా తీర్చిదిద్దే ప్రయత్నం చేశాడు. అయితే సినిమా కోసం ఎంచుకున్న పాయింట్ బాగానే ఉంది. కానీ దాని కోసం వేసుకున్న సబ్ ప్లాట్స్ ప్రేక్షకుడిని పెద్దగా ఎగ్జైట్ చేయలేకపోయాయి. ముఖ్యంగా తను స్ట్రైయిట్ గా సినిమాని ఒక ఫీల్ గుడ్ మూవీగా చెప్పిన బాగుండేది. కానీ ప్రేక్షకుడికి మధ్యలో ఎక్కడైనా బోర్ కొడుతుందేమో అనే ఉద్దేశంతో హీరో ఫ్రెండ్స్ గ్యాంగ్ తో కామెడీ చేయించాలి అనుకోని ఇష్టం వచ్చినట్టుగా సీన్లను రాసుకున్నాడు. అవి కామెడీని పండించకపోగా సినిమా చూసే ప్రేక్షకుడికి విసుగు తెప్పించాయి.

ముఖ్యంగా ఫస్టాఫ్ అంతా ఇలాగే సాగుతుంది. ఇంటర్వెల్ లో ఇచ్చిన ఒక ట్విస్టు కి మాత్రం ప్రేక్షకుడికి ఫ్యూజులు అవుట్ అయిపోతాయి. అలాంటి మంచి ట్విస్ట్ రాసుకున్న ఆయన సినిమా మొత్తాన్ని అలానే ఎంగేజింగ్ గా తీసుకొని వెళ్తే బాగుండేది కదా అనే ఒక ఫీల్ అయితే ట్విస్ట్ రివిల్ అయిన తర్వాత మనకు కలుగుతుంది. ఇక సెకండాఫ్ లో హీరో తన గోల్ కోసం ఏం చేశాడు అనే సన్నివేశాలను చాలా ఆసక్తికరంగా మార్చడానికి ప్రయత్నం చేసిన కూడా అవన్నీ ఆర్టిఫిషియల్ గా ఉన్నాయి. అలాగే వాటిని సాధించడానికి తను ఈజీగా అన్ని చేసుకుంటూ వెళ్లిపోవడం వల్ల సినిమా చూసిన వాళ్ళకి ఆ సీన్స్ అంత ఎఫెక్టివ్ గా అనిపించలేదు. ఇంకా క్లైమాక్స్ సన్నివేశాలు ఓకే అనిపించినప్పటికి ఓవరాల్ గా సినిమా సూపర్ సక్సెస్ అయ్యే కంటెంట్ ఉన్నప్పటికి దానిని దర్శకుడు అనవసరమైన సబ్ ప్లాట్స్ పెట్టి మొత్తం స్పాయిల్ చేశారనే చెప్పాలి. ఇక మొత్తానికైతే ఈ సినిమా తీసిపారేసేంత దారుణంగా ఏమీ లేదు. ఫ్యామిలీ అందరు కలిసి సరదాగా ఒకసారి చూడొచ్చు… ఇక కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు మాత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. ఆ సీన్స్ కి బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా బాగా హెల్ప్ అయింది…

ఇక ఎమోషనల్ సన్నివేశాలు బాగా హ్యాండిల్ చేసిన దర్శకుడు కామెడీ సన్నివేశాలను చిత్రకరించడంలో కొంతవరకు తడబడ్డాడు. కామెడీని పండించడంలో ద్రాజకుడు చాలా వరకు ఫెయిల్ అయ్యాడు. ఇక దర్శకుడు రాసుకున్న కథ కొత్తగా ఏమీ లేకపోయినా దాని చుట్టూ అల్లుకున్న ట్రీట్మెంట్ అయితే బాగుంది. సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు ఆ లవ్ స్టోరీ కి, ఎమోషనల్ సన్నివేశాలకి కనెక్ట్ అవుతూ ఉంటాడు. వాటిని బేస్ చేసుకొని సినిమా మొత్తాన్ని ఒకే ప్లాట్ మీద తీసుకెళ్తే మాత్రం ఈ మధ్యకాలంలో వచ్చిన లవ్ స్టోరీ లో ‘దివానా’ ది బెస్ట్ లవ్ స్టోరీ గా నిలిచిపోయేది…

ఆర్టిస్టుల పర్ఫామెన్స్

హర్షిత్ రెడ్డి (మున్నా) క్యారెక్టర్ లో జీవించేసాడు. ఒక ఆకతాయి కుర్రాడు ఎలా ఉంటాడు. డిగ్రీ కంప్లీట్ చేసుకుని ఎలాంటి బాధ్యతలు లేకుండా ఆకతాయిగా తిరుగుతున్న కుర్రాడి పాత్రను పర్ఫెక్ట్ గా పోట్రే చేశాడు… హీరో, హీరోయిన్ మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాల్లో కూడా తన ఇంటెన్స్ పెర్ఫార్మన్స్ ని చూపించాడు.

ఎమోషనల్ సన్నివేశాల్లో అయితే అందరినీ ఏడిపించేసాడనే చెప్పాలి…ఇక అమూల్య పాత్రలో నటించిన స్నేహ మణి మేఘాలై చాలా డీసెంట్ పర్ఫామెన్స్ ఇచ్చింది. ఈ మధ్య కాలం లో ఇలాంటి పాత్ర ఎవ్వరికి దొరకలేదు. కానీ ఆమె వచ్చిన అవకాశాన్ని చాలా బాగా వాడుకుంది. ఇక మిగతా ఆర్టిస్టులందరు వాళ్ల పాత్రల పరిధి మేరకు ఒకే అనిపించారు…

టెక్నికల్ అంశాలు…

ఈ సినిమాలోని సాంగ్స్ ఒకే అనిపించాయి. ముఖ్యంగా బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో చాలా కేర్ తీసుకున్నట్లుగా తెలుస్తుంది. విజువల్స్ ఒకే అనిపించాయి. ఇక కొన్ని యాక్షన్ సన్నివేశాలను కూడా చాలా రీచ్ గా తెరకెక్కించారు…ఇక ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఉన్నంతలో పర్లేదు అనిపించాయి…

ప్లస్ పాయింట్స్

ఎమోషనల్ సన్నివేశాలు
ఇంటర్వెల్ ట్విస్ట్
హీరో, హీరోయిన్ యాక్టింగ్

మైనస్ పాయింట్స్

ఫస్టాఫ్ చాలా స్లో అయింది…
కొన్ని అనవసరపు సన్నివేశాలు…
స్క్రీన్ ప్లే ఇంకా బెటర్ గా ఉంటే బాగుండేది…

రేటింగ్ : 2.25/5

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version