https://oktelugu.com/

krithi shetty: బోల్డ్ లుక్ లేదన్నారు.. కట్ చేస్తే వరుసగా బోల్డ్ సీన్సే చేస్తోంది !

krithi shetty: మొదటి సినిమా “ఉప్పెన” బ్లాక్ బస్టర్ అయినప్పుడు కూడా కృతి శెట్టి స్టార్ హీరోయిన్ అవుతుందని ఎవ్వరూ అనుకోలేదు. ఫేస్ లో హోమ్లీ నెస్ ఉంది కాబట్టి.. ఆమె బోల్డ్ క్యారెక్టర్స్ కి పనికి రాదు అనుకున్నారు. ఇక బోల్డ్ క్యారెక్టర్స్ కి పనికిరాని హీరోయిన్, ఎప్పటికీ స్టార్ హీరోయిన్ కాలేదు. అందుకే, ఎందరో హీరోయిన్లు రెండో సినిమాతోనే తెరమరుగు అయ్యారు కాబట్టి.. కృతి శెట్టి కూడా మరుగు చాటుకి వెళ్లక తప్పదు అని […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : January 22, 2022 / 10:54 AM IST
    Follow us on

    krithi shetty: మొదటి సినిమా “ఉప్పెన” బ్లాక్ బస్టర్ అయినప్పుడు కూడా కృతి శెట్టి స్టార్ హీరోయిన్ అవుతుందని ఎవ్వరూ అనుకోలేదు. ఫేస్ లో హోమ్లీ నెస్ ఉంది కాబట్టి.. ఆమె బోల్డ్ క్యారెక్టర్స్ కి పనికి రాదు అనుకున్నారు. ఇక బోల్డ్ క్యారెక్టర్స్ కి పనికిరాని హీరోయిన్, ఎప్పటికీ స్టార్ హీరోయిన్ కాలేదు. అందుకే, ఎందరో హీరోయిన్లు రెండో సినిమాతోనే తెరమరుగు అయ్యారు కాబట్టి.. కృతి శెట్టి కూడా మరుగు చాటుకి వెళ్లక తప్పదు అని ఆ మధ్య టాక్ బాగా వినిపించింది. కానీ కట్ చేస్తే.. సీన్ మొత్తం రివర్స్ అయింది.

    krithi shetty in shyam singh roy

    మొదటి సినిమాతోనే హిట్ కొట్టిన యంగ్ బ్యూటీ కృతిశెట్టి. వరుసగా 3 విజయాలు సాధించింది. పైగా మూడు సినిమాల్లోనూ ఫుల్ బోల్డ్ గా నటించింది. దాంతో ప్రస్తుతం టాలీవుడ్ హీరోలకు కృతి లక్కీ ఛార్మ్‌గా మారింది. లాస్టియర్ మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’ తో మొదలైంది కృతిశెట్టి జైత్రయాత్ర. ఈ ఏడాది ‘శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు’ చిత్రాలతో రెండు వరుస నెలల్లో ఘనవిజయాలు సొంతం చేసుకుంది. ఇప్పుడు మరో 4 క్రేజీ ప్రాజెక్టులు లైన్‌లో ఉన్నాయి.

    Also Read: ‘పుష్ప’తో బన్నీ కంటే.. మహేష్ కే ఎక్కువ డిమాండ్ వచ్చింది !

    Tollywood Heroine Krithi Shetty

     

    దాంతో ఈ బెంగళూరు భామకు రెమ్యునరేషన్ ను కూడా పెంచేశారు నిర్మాతలు. ఒక్కో సినిమాకు 3 కోట్లు ఇవ్వడానికి కూడా ఆసక్తి చూపిస్తున్నారట. ఇది నిజంగా షాకింగ్ విషయమే. ఇక కృతి శెట్టి మొత్తానికి ఒక స్పెషల్ సాంగ్ చేయడానికి కూడా సన్నద్ధం అయింది. కృత, కళ్యాణ్ రామ్ హీరోగా రాబోతున్న కొత్త సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ లో నటించబోతుంది. ప్రత్యేక సాంగ్స్ చెయ్యడం ఈ మధ్య హీరోయిన్లకు ఫ్యాషన్ అయిపోయింది.

    Also Read: లాస్ట్ వీక్ హాట్ ఫోటో షూట్ చేసి.. అంతలోనే తల్లి ఎలా అయింది ?

    Tags