AP MLAs and MPs : ఆంధ్రరాష్ట్రం ఏర్పడ్డ 1952 నుంచి నేటి వరకూ ఎంతో మంది దిగ్గజ నాయకులు ఈ నేలను ఏలారు. టంగుటూరు ప్రకాశం నుంచి నేటి జగన్ వరకూ సీఎంలుగా సేవలందించారు. ఎంతో మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు తెలుగు జాతిపై చెరగని ముద్ర వేశారు. మరి ఆంధ్రప్రదేశ్ లో నాటి నుంచి నేటి వరకూ గెలిచిన ప్రతీ ఎమ్మెల్యే, ఎంపీ వివరాలు తెలిస్తే ఎంత బాగుటుంది. అదే ప్రయత్నం జరిగింది. అదో పుస్తకరూపంలో ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్థానాల నుంచి, రాష్ట్రంలోని లోక్ సభ స్థానాల నుంచి 1952 నుంచి 2019 వరకూ ఎన్నికైన ప్రజా ప్రతినిధుల పేర్లు, ఆయా స్థానాల్లో సామాజిక సమీకరణాలు, ఏ పార్టీ ఎన్నిమార్లు గెలుపు సాధించింది అనే వివరాలతో సచిత్రంగా రూపొందిన పుస్తకం ‘ఆంధ్ర ప్రదేశ్ లోక్ సభ, శాసన సభలో ఎవరెవరు?’ అన్నది తాజాగా విడుదలైంది..
ఈ సమాచారాన్ని మారిశెట్టి మురళీ కుమార్ గ్రంధస్తం చేశారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. గ్రంధకర్త మురళీ కుమార్ ను అభినందించారు.
‘ఆంధ్ర ప్రదేశ్ లోక్ సభ, శాసన సభలో ఎవరెవరు?’ పుస్తకం రాజకీయాలపై ఆసక్తి ఉన్నవారికీ, ఈ రంగంలో ఉన్నవారికీ ఉపయుక్తంగా ఉంటుంది అన్నారు. ఈ పుస్తకం ఆగష్టు చివరి వారం నుండి మార్కెట్లో అందుబాటులోకి రానుంది.