‘Baby’ movie : ఈమధ్య కాలం లో ఎంత పెద్ద సూపర్ హిట్ సినిమా అయినా కేవలం నాలుగు వారాల్లోనే ఓటీటీ లో విడుదల అయిపోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. దీంతో ప్రేక్షకులు థియేటర్స్ వైపు వెళ్ళడానికి బద్దకిస్తున్నారు. కరోనా లాక్ డౌన్ సమయం లో ఓటీటీ కి బాగా అలవాటు పడిన జనాలు ఇక థియేటర్స్ కి ఏమి వస్తారులే అని అనుకునే వారు, కానీ ఈమధ్య ఒక సినిమా బాగుంటే ఆ చిత్రం ఓటీటీ లో విడుదలైన తర్వాత కూడా అద్భుతమైన వసూళ్లను సాధిస్తూ వంద రోజులు కూడా ఆడేస్తున్నాయి.
చిన్న సినిమాలను కూడా ఒక రేంజ్ లో ప్రోత్సహిస్తున్నారు ఆడియన్స్. ఒకపక్క థియేట్రికల్ పరంగా, మరో పక్క డిజిటల్ ఓటీటీ పరంగా నిర్మాతలకు లాభాలే లాభాలు. ఇది నిజంగా ట్రేడ్ పండితులు కూడా అంచనా వెయ్యలేకపోయారు. ఇక రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము లేపుతున్న ‘బేబీ’ మూవీ ఓటీటీ విడుదల తేదీ కూడా వచ్చేసింది.
ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఈ చిత్రాన్ని ఆగస్టు 15 వ తారీఖున ఆహా మీడియా లో విడుదల చేయబోతున్నట్టు సమాచారం. సరిగ్గా సెలవు దినం రోజు ఈ సినిమాని ఓటీటీ లో విడుదల చేస్తున్నారంటే కచ్చితంగా అద్భుతమైన ఆదరణ దక్కుతుంది అనే చెప్పొచ్చు.
మరి చిన్న సినిమాలను థియేటర్స్ లో చూడడం మానేసిన ప్రేక్షకులకు ఈ చిత్రం ఓటీటీ విడుదల తేదీ రావడం అనేది పండగ లాంటి వార్త అనే చెప్పాలి. ఇక పోతే బాక్స్ ఆఫీస్ వద్ద ఇప్పటికే 15 కోట్ల రూపాయిలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా , ఫుల్ రన్ లో 30 కోట్ల రూపాయిలు వసూలు చేస్తుందని, ఇంకా ఎక్కువ వసూళ్లు వచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. చూడాలి మరి ఈ చిత్రం ఆ రేంజ్ కి వెళ్తుందా లేదా అనేది.