Vaishnavi Chaitanya: విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం బేబీ. ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ గా దర్శకుడు సాయి రాజేష్ తెరకెక్కిస్తున్నారు. విరాజ్ అశ్విన్ మరో హీరోగా నటిస్తున్నారు. వాస్తవ సంఘటనల ఆధారంగా బేబీ చిత్రం రూపొందిస్తున్నట్లు సమాచారం. బేబీ చిత్ర హీరోయిన్ వైష్ణవి చైత్యన్య టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. ఒకప్పటి సోషల్ మీడియా సెలబ్రిటీ హీరోయిన్ కావడాన్ని జనాలు ప్రముఖంగా చెప్పుకుంటున్నారు. బేబీ మూవీలో ఆమెది డీగ్లామర్ రోల్ అని తెలుస్తుంది. ఇటీవల విడుదలైన టీజర్ అది స్పష్టమైంది.

బేబీ టీజర్ విడుదల సందర్భంగా దర్శకుడు సాయి రాజేష్ హీరోయిన్ ఎంపిక గురించి మాట్లాడారు. యూట్యూబర్ అయిన వైష్ణవి చైతన్య హీరోయిన్ గా వద్దు. ఆమెకు బదులు మరో అమ్మాయిని తీసుకోండని చాలా మంది సలహా ఇచ్చారు. బేబీ సినిమాలో హీరోయిన్ పాత్రకు ఆమెనే కరెక్ట్ అని నేను అనుకున్నాను. అందుకే వైష్ణవి చైతన్యను ఎంచుకున్నానని చెప్పడం విశేషంగా మారింది.
ఇక వైష్ణవి చైతన్య డిటైల్స్ పరిశీలిస్తే… 1994 జనవరి 4న విజయవాడలో పుట్టిన ఈ యంగ్ బ్యూటీ చదువుకునే రోజుల్లోనే నటన పట్ల ఆసక్తి పెంచుకుంది. సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్స్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరవ్వాలి అనుకుంది. మొదట్లో వైష్ణవి డబ్ స్మాష్ వీడియోలు చేసేది. టిక్ టాక్, ఫేస్బుక్, ఇంస్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ లో ఆమె బాగా పాపులర్ అయ్యారు.
తర్వాత యూట్యూబర్ గా కెరీర్ స్టార్ట్ చేశారు. పలు షార్ట్ ఫిలిమ్స్, కొన్ని వెబ్ సిరీస్లలలో నటించారు. బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్ హీరోగా తెరకెక్కిన రొమాంటిక్ సిరీస్ ‘ది సాఫ్ట్ వేర్ డెవ్ లవ్ పర్’ లో హీరోయిన్ గా వైష్ణవి నటించారు. ఆ సిరీస్ సూపర్ సక్సెస్ కావడంతో వైష్ణవికి మంచి ఫేమ్ వచ్చింది.

సినిమాల్లో వైష్ణవి చిన్న చిన్న పాత్రలు, సపోర్టింగ్ రోల్స్ చేస్తున్నారు. అల్లు అర్జున్, నాని, రవితేజ చిత్రాల్లో వైష్ణవి చైతన్య నటించారు. వెండితెరపై బేబీ మూవీతో హీరోయిన్ గా కనిపించనున్నారు. ఈ మూవీలో ఆమెది డీగ్లామర్ రోల్. వైష్ణవి ఎంపిక వెనుక కారణం కూడా అదే కావచ్చు. ఒక మిడిల్ క్లాస్ అమాయకపు అమ్మాయిగా ఈ మూవీలో ఆమె నటిస్తున్నారు. హీరోయిన్ గా వైష్ణవి చైతన్య ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.