HomeజాతీయంIndia Recession 2022: ఇండియాకు పాకిన ‘మాంద్యం’ ఎఫెక్ట్.. నిన్న హెచ్.పీ.. నేడు క్యూలో కంపెనీలు?

India Recession 2022: ఇండియాకు పాకిన ‘మాంద్యం’ ఎఫెక్ట్.. నిన్న హెచ్.పీ.. నేడు క్యూలో కంపెనీలు?

India Recession 2022: ఆర్థిక మాంద్యం.. దీని ప్రభావం ఏమోగానీ.. పేరు మోసిన సంస్థలు ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా బయటకు పంపేస్తున్నాయి. ఇప్పటికే ఫేస్ బుక్, నెట్ ఫ్లిక్స్, అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్ వంటి సంస్థలు ఉద్యోగులను బయటకు పంపించేశాయి.. ఇవే కాకుండా ఇంకా చాలా సంస్థలు ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. నవంబర్ 21 నాటికి 1,36,000 మంది ఉద్యోగులు తమ కొలువులను కోల్పోయారు. ముఖ్యంగా యాపిల్, నెట్ ప్లిక్స్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ ఈ కంపెనీలకు చెందిన మూడు ట్రిలియన్ డాలర్లు అంటే దాదాపు 244 లక్షలు కోట్ల వరకు సంపద మార్కెట్ నుంచి ఆవిరి అయిపోయింది. తాజాగా ఇప్పుడు ఆ కంపెనీల జాబితాలో హెచ్పీ కూడా చేరింది.. కంప్యూటర్లకు డిమాండ్ పడిపోవడంతో హెచ్పీ సంస్థ కూడా లే ఆఫ్ బాట ఎంచుకుంది. నిన్న మొన్నటి వరకు ఇది అమెరికాకు మాత్రమే పరిమితం అనుకున్నాం.. ఇప్పుడు ఇది భారత్ లాంటి సేవా ఆధారిత కంపెనీలకు కూడా పాకింది. కోవిడ్ తర్వాత అంతంతమాత్రంగా ప్రాజెక్టులు ఉండడంతో కంపెనీలు కూడా పొదుపు చర్యలు పాటిస్తున్నాయి.. దేశంలో భారీ ఎత్తున నియామకాలు చేపట్టే టిసిఎస్, ఇన్ఫోసిస్, విప్రో, క్యాప్ జెమినీ వంటి సంస్థలు ఉద్యోగుల్లో నిరాశ జనకమైన పనితీరు ప్రదర్శిస్తున్న వారి జాబితాను తయారు చేయడం మొదలుపెట్టాయి. ఈ కంపెనీలన్నీ కలిపి వేలాది సంఖ్యలో ఉద్యోగులను తొలగించే అవకాశం కనిపిస్తున్నట్లు సమాచారం

India Recession 2022
HP

ఉద్యోగుల్లో కలకలం

ఐటి ఉద్యోగుల్లో లే ఆప్స్ ట్రెండ్ కలవరం రేపుతున్నది. రోజుకో ఐటీ సంస్థ లే ఆఫ్స్ ను ప్రకటిస్తూ ఉద్యోగుల్లో ఆందోళనకు కారణమవుతోంది.. అమెజాన్, మెటా, సేల్స్ ఫోర్స్, కాగ్నిజెంట్ వంటి బహుళ జాతి కంపెనీలు ఉద్యోగులను తప్పించేశాయి.. 2025 ఆర్థిక సంవత్సరం నాటికి మొత్తం 6000 మంది ఉద్యోగులను తొలగించాలని హెచ్ పీ యాజమాన్యం నిర్ణయించింది. ప్రపంచ వ్యాప్తంగా హెచ్ పీ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగుల్లో 12 శాతం మందిని ఇంటికి పంపాలని ఆ కంపెనీ నిర్ణయించింది.. పర్సనల్ కంప్యూటర్లు, లాప్టాప్ మార్కెట్ ప్రస్తుతం అంత లాభదాయకంగా నడవడం లేదు.

6000 మందికి ఉద్వాసన

హెచ్ పీ కంపెనీలో ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 50 వేల మంది పనిచేస్తున్నారు. వీరిలో నాలుగు వేల నుంచి 6000 మంది దాకా ఉద్వాసన పలకాలని హెచ్ పీ సంస్థ నిర్ణయించింది..హెచ్ పీ మాత్రమే కాదు పర్సనల్ కంప్యూటర్లకు డిమాండ్ తగ్గిపోవడంతో ఆ ప్రభావం చిప్ మేకర్ సంస్థ ఇంటెల్ కార్ప్ పై కూడా పడింది. ఇంటెల్ లో జూలై నాటికి 1,13,700 ఉద్యోగులు పనిచేస్తున్నారు.. ప్రస్తుతం పరిస్థితి అంతా ఆశాజనకంగా లేకపోవడంతో వర్క్ ఫోర్సును భారీగా తగ్గించుకోవాలని ఇంటెల్ భావిస్తున్నట్టు సమాచారం. ఇంటెల్ కూడా వేల సంఖ్యలో ఉద్యోగులకు ఉద్వాసన పలికే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇంటెల్ లో ఎస్ అండ్ మార్కెటింగ్ విభాగాలతో కలిపి మొత్తం 20% ఉద్యోగులను తగ్గించుకోవాలనే ఆలోచనలో యాజమాన్యం ఉన్నట్టు తెలుస్తోంది.

India Recession 2022
HP

ఐటీ కి ఎందుకు ఈ ఇబ్బంది

ఐటీ కంపెనీలు ముఖ్యంగా ప్రాజెక్టుల ఆధారంగా నడుస్తూ ఉంటాయి.. అయితే యూరో జోన్ లో ప్రస్తుతం అనిశ్చితి పరిస్థితులు నెలకొన్నాయి. గత ఏడాది నుంచి అక్కడ పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. పేరుకు రష్యా, ఉక్రెయిన్ యుద్ధం అంటున్నారు కానీ.. అక్కడ అంతకు ముందు నుంచే ఆర్థిక మందగమనం మొదలైంది. పెద్ద పెద్ద కంపెనీలు తమ ప్రాజెక్టులను వాయిదా వేసుకున్నాయి.. అలా టెక్నాలజీ తయారీ సంస్థలకు ప్రాజెక్టులు లేకుండా పోయాయి. కొనుగోళ్ళు లేకపోవడం, అమ్మకాలు మందగించడంతో ఒక్కసారిగా ఐటి ఒడిదుడులకు ఎదురైంది. ఆ ప్రభావం ఇప్పుడు ఉద్యోగులపై పడుతున్నది. 2023 లోనూ ఇదే స్థాయిలో ఉద్యోగుల తొలగింపులు ఉంటాయని ఐటీ కంపెనీలు చెబుతుండడం పరిస్థితి తీవ్రతను తేట తెల్లం చేస్తున్నది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version