https://oktelugu.com/

Baby Movie Collections : 4వ రోజు కూడా అదే జోరు..ఎక్కడ చూసిన ‘బేబీ’ మ్యానియానే!

మొదటి మూడు రోజులకు కలిపి ప్రపంచవ్యాప్తంగా 11 కోట్ల రూపాయిలకు పైగానే షేర్ వసూళ్లను సాధించిన ఈ సినిమా, నాలుగు రోజులకు కలిపి ప్రపంచవ్యాప్తంగా 15 కోట్ల రూపాయిలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది.

Written By:
  • NARESH
  • , Updated On : July 17, 2023 / 08:16 PM IST

    Baby Movie Review

    Follow us on

    Baby Movie Collections : రీసెంట్ గా చిన్న సినిమాగా విడుదలై బాక్స్ ఆఫీస్ విస్ఫోటనం లాంటి విద్వంసం ని సృష్టిస్తున్న సినిమా ‘బేబీ’. విడుదలకు ముందే టీజర్ , ట్రైలర్ మరియు పాటలతో యూత్ ఆడియన్స్ ని ప్రమోషనల్ కంటెంట్ తో విశేషంగా ఆకట్టుకున్న ఈ చిత్రం. విడుదల తర్వాత ప్రీమియర్ షోస్ నుండే అద్భుతమైన టాక్ తెచ్చుకొని బాక్స్ ఆఫీస్ వద్ద బంపర్ ఓపెనింగ్ ని దక్కించుకుంది.

    మొదటి రోజు ఓపెనింగ్స్ తో ట్రేడ్ పండితులకు మైండ్ బ్లాక్ అయ్యేలా చెయ్యగా, రెండవ రోజు మొదటి రోజుకంటే ఎక్కువ వసూళ్లను రాబట్టి సరికొత్త చరిత్ర సృష్టించింది. మూడవ రోజు కూడా ఇదే ట్రెండ్. హిట్ సినిమాలకు వీకెండ్ వరకు బాగా ఉంటుంది అనడం లో పెద్దగా సర్ప్రైజ్ లేదు, కానీ సోమవారం రోజు పనిదినం అయ్యినప్పటికీ కూడా మూడవ రోజు కంటే ఎక్కువ వసూళ్లను రాబట్టడం చూస్తుంటే పబ్లిక్ లో ఈ సినిమా పై ఎలాంటి క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.

    ఆదివారం రోజు, అనగా మూడవ రోజు ఈ సినిమాకి 3 కోట్ల 20 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇంకా నాల్గవ రోజు అయితే ఈ సినిమాకి 4 కోట్ల రూపాయిలకు పైగానే షేర్ వసూళ్లు వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. తెలంగాణాలో బోనాలు కాబట్టి అక్కడ ఈ చిత్రానికి ఈ రేంజ్ వసూళ్లు వచ్చాయి. కానీ ఆంధ్ర ప్రదేశ్ అలాంటి పండుగలు ఏమి జరగడం లేదు. అయినప్పటికీ కూడా నూన్ షోస్ నుండే అద్భుతమైన ట్రెండ్ ని కనబర్చి ట్రేడ్ పండితులను నోరెళ్లబెట్టేలా చేసింది.

    మొదటి మూడు రోజులకు కలిపి ప్రపంచవ్యాప్తంగా 11 కోట్ల రూపాయిలకు పైగానే షేర్ వసూళ్లను సాధించిన ఈ సినిమా, నాలుగు రోజులకు కలిపి ప్రపంచవ్యాప్తంగా 15 కోట్ల రూపాయిలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. పెట్టిన డబ్బులకు రెండింతల లాభాలు మొదటి వారం లోపే రాబట్టడం ఈమధ్య కాలం లో ఈ సినిమాకే జరిగింది.