Vaishnavi Chaitanya: సాయి రాజేష్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన చిత్రం బేబీ. ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. ఈ మూవీలో సోషల్ మీడియా సెలబ్రిటీ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించారు. బేబీ మూవీ జులై 14న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. ప్రమోషన్స్ లో భాగంగా బుధవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు విజయ్ దేవరకొండ అభిమానులు హాజరయ్యారు.
బేబీ ప్రీ రిలీజ్ వేడుకలో మాట్లాడిన హీరోయిన్ వైష్ణవి చైతన్య ఎమోషనల్ అయ్యారు. ఆమె కన్నీరు పెట్టుకోవడంతో అక్కడ భావోద్వేగ వాతావరణం చోటు చేసుకుంది. వైష్ణవి మాట్లాడుతూ… సమాజంలో జరుగుతున్న వాస్తవ సంఘటనల ఆధారంగా బేబీ మూవీ తెరకెక్కింది. కథలో ప్రతి ఒక్కరూ లీనమవుతారు. యూట్యూబ్ వీడియోలు చేసుకునే నా దగ్గరకు బేబీ కథ వచ్చింది. సాయి రాజేష్ నాకంటే నన్ను ఎక్కువగా నమ్మి ముందుకు నడిపించారు.
మెయిన్ లీడ్ చేయాలనేది నా కల. దాని కోసం చాలా విషయాలు నేర్చుకున్నాను. సపోర్టింగ్ రోల్స్ కూడా చేశాను. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా మారాను. మనల్ని విమర్శించేవాళ్ళు పొగిడేవారు ఉంటారు. ఈ యూట్యూబ్ అమ్మాయి హీరోయిన్ గా చేస్తుందా అనే విమర్శలు వినిపించాయి. అందుకే బేబీ ఆఫర్ నాకు వచ్చినప్పుడు చేయగలనా అనే ఒక సందేహం నాలో కలిగింది. సినిమా గురించి అన్ని విషయాలు చెప్పి సాయి రాజేష్ నాకు ధైర్యం ఇచ్చారు. ఆయన నాకు పునర్జన్మ ఇచ్చారు. ఆయన వలన నేను కొత్త ప్రపంచం చూశాను, అన్నారు.
ఒడిదుడుకుల్లో నిర్మాత ఎస్కేఎన్ తోడుగా ఉన్నారని వైష్ణవి చైతన్య ఎమోషనల్ అయ్యారు. అనంతరం ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ మీ అన్నయ్య మాస్ హీరోగా ఎదిగారు. మీరెందుకు ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్స్ చేస్తున్నారని అడుగుతున్నారు. ప్రేమలో నిజాయితీ కంటే మాస్ మూవీ ఏముంటుంది. బేబీ మాస్ మూవీనే. యూత్ కి బాగా కనెక్ట్ అవుతుందని చెప్పుకొచ్చారు.