పవన్ ట్రీట్మెంట్ పై బాబు కామెంట్.. వీధికుక్కతో పోల్చిన మెగాబ్రదర్!

కొంత మంది ప్ర‌త్య‌ర్థులు ఎలా ఉంటారంటే.. స‌మ‌యం, సంద‌ర్భం ఏవీ ఉండ‌వు. ఎలాంటి కండీష‌న్లో ఉన్నా విమ‌ర్శ‌లు గుప్పిస్తూనే ఉంటారు. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌స్తుతం క‌రోనాతో బాధ‌ప‌డుతూ చికిత్స తీసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. దీనిపై ఎవ‌రో అభిమాని ఓ కార్టూన్ వేశాడు. ఆసుప‌త్రి బెడ్ పై ప‌డుకొని చికిత్స తీసుకుంటున్న ప‌వ‌న్ ను వివేకానంద‌, చేగువేరా వ‌చ్చి ప‌రామ‌ర్శిస్తున్న‌ట్టుగా బొమ్మ వేశాడు. ఈ ఫొటో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అయ్యింది. అభిమానులు పాజిటివ్ […]

Written By: Bhaskar, Updated On : April 18, 2021 10:07 am
Follow us on


కొంత మంది ప్ర‌త్య‌ర్థులు ఎలా ఉంటారంటే.. స‌మ‌యం, సంద‌ర్భం ఏవీ ఉండ‌వు. ఎలాంటి కండీష‌న్లో ఉన్నా విమ‌ర్శ‌లు గుప్పిస్తూనే ఉంటారు. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌స్తుతం క‌రోనాతో బాధ‌ప‌డుతూ చికిత్స తీసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. దీనిపై ఎవ‌రో అభిమాని ఓ కార్టూన్ వేశాడు.

ఆసుప‌త్రి బెడ్ పై ప‌డుకొని చికిత్స తీసుకుంటున్న ప‌వ‌న్ ను వివేకానంద‌, చేగువేరా వ‌చ్చి ప‌రామ‌ర్శిస్తున్న‌ట్టుగా బొమ్మ వేశాడు. ఈ ఫొటో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అయ్యింది. అభిమానులు పాజిటివ్ గా షేర్ చేస్తుండ‌గా.. కొంద‌రు నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారు. దీనిపై హేతువాదిగా పిల‌వ‌బ‌డే బాబు గోగినేని కూడా సెటైర్లు వేశారు.

ఫేస్ బుక్ ఖాతాలో ఈ ఫొటోను షేర్ చేసిన ఆయ‌న‌.. పెద్ద పోస్టే రాసుకొచ్చారు. ‘‘వివేకానందుల వారు, చేగువేరా గారు.. మాస్కు లేకుండా రిస్క్ తీసుుకొని.. చక్కగా తలదువ్వుకొని లుంగీలో డ్రెస్ అయ్యి, సెలైన్ ఎక్కించుకుంటున్న హీరోకోసం రావడం స్ఫూర్తిదాయకం’’ అంటూ వ్యంగ్యంగా పోస్టు చేశారు. దీనిపై అభిమానులు ఆగ్ర‌హం వ్య‌క్తంచేస్తున్నారు.

క‌రోనా సోకి చికిత్స తీసుకుంటున్న ప‌వ‌న్ పై ఇలాంటి వ్యాఖ్య‌లు చేస్తున్నావంటే నీ సదువు సంక‌నాక‌నా? అంటూ స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇస్తున్నారు అభిమానులు. అయితే.. గోగినేని పోస్టును నాగ‌బాబుకు ట్యాగ్ చేశాడో అభిమాని. దీనికి మెగా బ్ర‌ద‌ర్ రిప్లై ఇస్తూ.. ‘‘ఇలాంటివి నాకు పంప‌కండ‌య్యా. నేను కేవ‌లం నా పెంపుడు కుక్క‌ల మీద‌నే ఇంట్ర‌స్ట్ చూపిస్తాను’’అని కామెంట్ చేశారు. దీంతో.. నాగ‌బాబు పరోక్షంగా ఆయ‌న‌ను వీధికుక్క‌‌తో పోల్చాడ‌ని ఫ్యాన్స్ పోస్టులు చేస్తున్నారు.