Homeఎంటర్టైన్మెంట్Babu Gogineni: విశ్వక్ సేన్ మరియు దేవి నాగవల్లి వివాదం గురించి బాబు గోగినేని సెన్సషనల్...

Babu Gogineni: విశ్వక్ సేన్ మరియు దేవి నాగవల్లి వివాదం గురించి బాబు గోగినేని సెన్సషనల్ కామెంట్స్

Babu Gogineni: గత కొద్దీ రోజుల నుండి టీవీ 9 రిపోర్టర్ దేవి మరియు ప్రముఖ హీరో విశ్వక్ సేన్ మధ్య ఒక్క రేంజ్ వివాదం నడుస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..సోషల్ మీడియా అంతటా ఎక్కడ చూసిన దీని గురించే ప్రస్తుతం చర్చ నడుస్తుంది..తన కొత్త సినిమా ‘ఆకాశవానంలో అర్జున కళ్యాణం’ ప్రొమోషన్స్ లో భాగంగా సరికొత్త ఆలోచనలతో రోడ్ల మీద ప్రాంక్ చేసిన సంఘటన ని టీవీ 9 పెద్ద చర్చకు దారి తీసి విశ్వక్ సేన్ పై విరుచుకుపడింది..ఆయనని లైవ్ డిబేట్స్ కి పిలిచి యాంకర్ దేవి అతనికి కోపం కలిగించే కొన్ని వ్యాఖ్యలు చేసింది..దానికి దీటుగా విశ్వక్ సేన్ కూడా సమాధానం చెప్పడం తో, ఆగ్రహం కట్టలు తెంచుకున్న టీవీ 9 రిపోర్టర్ దేవి నాగవల్లి విశ్వక్ సేన్ ని ‘గెట్ అవుట్ ఫ్రొం మై స్టూడియో’ అంటూ పెద్దగా అరిచినా వీడియో గత కొద్దీ రోజుల నుండి సోషల్ మీడియా లో ఒక్క రేంజ్ లో వైరల్ అయినా సంగతి మన అందరికి తెలిసిందే.

Babu Gogineni
Babu Gogineni

అయితే ఈ సంఘటన పై ఇప్పుడు టాలీవుడ్ కి చెందిన కొంతమంది ప్రముఖులు మరియు రాజకీయ విశ్లేషకులు కూడా స్పందిస్తున్నారు..వీళ్ళిద్దరిలో ఎక్కువ శాతం మంది విశ్వక్ సేన్ కి ఎక్కువ మద్దతు తెలుపుతున్నారు..ఇది ఇలా ఉండగా హేతువాది అయినా బాబు గోగినేని గారి పోస్టులకు సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చే సంగతి మన అందరికి తెలిసిందే..

Also Read: Bhala Thandanana Review: రివ్యూ : ‘‘భళా తందనాన’

ఆయన కూడా ఈ సంఘటన పై తనదైన స్టైల్ లో స్పందించారు..’విశ్వక్ సేన్ F తో ప్రారంభం అయ్యే పురుష పదజాలంతో మాట్లాడడం ముమ్మాటికీ తప్పే, కాదు అని నేను ఎప్పుడు అనను..కానీ టీవీ 9 వారు కూడా గతం లో ఇలాంటి ప్రాంక్స్ చాలానే చేసారు..ఇటీవల విశ్వక్ సేన్ చేసిన ప్రాంక్ గతం లో టీవీ 9 సేమ్ టూ సేమ్ చేసింది..కావాలంటే మీరే చూడండి ‘ అంటూ బాబు గోగినేని టీవీ 9 పాత వీడియో ని పోస్ట్ చెయ్యడం ఇప్పుడు సోషల్ మీడియా లో సెన్సషనల్ గా మారింది.

Babu Gogineni
devi nagavalli-vishwak sen

ఇది ఇలా ఉండగా విశ్వక్ సేన్ హీరో గా నటంచిన ‘ఆకాశవానం లో అర్జున కళ్యాణం’ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల అయ్యింది..చాలా కాలం తర్వాత ఒక్క మంచి కామెడీ ఎంటర్టైనర్ ని చూసాము అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్లు ఈ సినిమా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు..విశ్వక్ సేన్ ప్రస్తుతం ఉన్న కాంట్రవర్సీ సమయం లో ఆయనకీ ఈ సినిమా ఫలితం మంచి ఊపు ని ఇచ్చింది అనే చెప్పాలి..చూడాలి మరి, పాజిటివ్ రివ్యూస్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతమేరకు నెట్టుకొస్తుందో అనేది.

Also Read:OKTelugu MovieTime: టుడే మూవీ క్రేజీ అప్ డేట్స్

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

5 COMMENTS

Comments are closed.

RELATED ARTICLES

Most Popular