Baahubali The Epic 100 Crores Gross: ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ కి అసలు రీ రిలీజ్ అంటే ఏంటో కొత్త అర్థం చెప్పిన చిత్రం ఈరోజు విడుదలైన ‘బాహుబలి : ది ఎపిక్'(Bahubali : The Epic). ఇప్పటి వరకు వచ్చిన రీ రిలీజ్ సినిమాలన్నీ, ఎదో అభిమానుల ప్రేమ ని క్యాష్ చేసుకోవడానికి రిలీజ్ అయ్యినవే కానీ, ఇన్నేళ్ల తర్వాత మరోసారి రిలీజ్ అవుతున్న సినిమా, ఆడియన్స్ కి సరికొత్త అనుభూతి కలిగించేలా ఎదో ఒకటి చెయ్యాలి అనే తపన తో రీ రిలీజ్ అయిన సినిమా ఒక్కటి కూడా లేదు. కానీ రాజమౌళి అలా కాదు, పదేళ్ల తర్వాత బాహుబలి ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం, మన వైపు నుండి వాళ్లకు బెస్ట్ థియేట్రికల్ అనుభూతిని అందించాలి అనే పట్టుదలతో, ఆడియన్స్ ఇప్పటి వరకు చూడని కొత్త సన్నివేశాలతో, రెండు భాగాలను కలిపి ఒక అద్భుతమైన సినిమాగా మన ముందుకు తీసుకొచ్చాడు.
ఈ చిత్రాన్ని చూసి బయటకు వచ్చిన ప్రతీ ఒక్కరికి, ఇది కదా అసలు సిసలు రీ రిలీజ్ అంటే, అసలు పాత సినిమాని చూస్తున్న అనుభూతి కలగలేదు, కొత్త సినిమాని చూస్తున్నట్టుగానే అనిపిస్తోంది అంటూ సోషల్ మీడియా ద్వారా తమ అనుభూతులను పంచుకుంటున్నారు. ఇకపోతే ప్రస్తుతం బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి గంటకు 8 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. ఒక రీ రిలీజ్ చిత్రానికి హిస్టరీ లో ఈ రేంజ్ ట్రెండ్ ని చూడడం ఇప్పటి వరకు జరగలేదు. గంటకు మూడు వేల టిక్కెట్లు ఒక రీ రిలీజ్ చిత్రానికి అమ్ముడుపోతే, అబ్బో అని చూసే వాళ్ళు ఒకప్పుడు. అలాంటిది ఇప్పుడు ఏకంగా గంటకు 8 వేల టికెట్స్ అమ్ముడుపోవడాన్ని చూసి మెంటలెక్కిపోతున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఊపు చూస్తుంటే ఈ చిత్రం కచ్చితంగా ఫుల్ రన్ లో 50 నుండి 100 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టేలాగా అనిపిస్తుంది.
ఈ రేంజ్ గ్రాస్ ని రాబడితే ఇక మీదట రీ రిలీజ్ లో కూడా నాన్ బాహుబలి రికార్డు అని చెప్పుకోపిని తిరిగే పరిస్థితి ఏర్పడుతుంది. ఇన్ని రోజులు మన టాలీవుడ్ లో రీ రిలీజ్ రికార్డ్స్ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు చుట్టూనే తిరిగేవి. కానీ బాహుబలి తో ప్రభాస్ వాళ్లకు అందనంత ఎత్తుకి రికార్డు క్రియేట్ చేసి పెట్టాడు. దీనిని బ్రేక్ చేయడం ఆ ఇద్దరి హీరోలకు మాత్రమే కాదు, ప్రభాస్ కి కూడా అసాధ్యం. కానీ బాహుబలి మొదటి రోజు రికార్డుని మాత్రం పవన్ కళ్యాణ్ బద్దలు కొడతాడని బలమైన నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్. ఈ ఏడాది చివర్లో కానీ, వచ్చే ఏడాది లో కానీ, అత్తారింటికి దారేది చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తామని, ఈ సినిమాతో బాహుబలి రీ రిలీజ్ మొదటి రోజు రికార్డు ని కోరుతామని పవన్ ఫ్యాన్స్ ఛాలెంజ్ చేస్తున్నారు. చూడాలి మరి ఎంతవరకు ఈ రికార్డు ని అందుకోగలరు అనేది.