Baahubali The Epic Collections: తెలుగు చలన చిత్ర పరిశ్రమ స్థితి గతులను మార్చిన చిత్రం బాహుబలి. అసలు ఈ సినిమా లేకుంటే మన తెలుగు సినిమా నేడు ఈ రేంజ్ ఎదిగేదా?, పాన్ వరల్డ్ రేంజ్ లో మన ఖ్యాతి విస్తరించేదా అంటే కచ్చితంగా కాదు అనే చెప్పాలి. కేవలం టాలీవుడ్ మాత్రమే కాదు, కోలీవుడ్, శాండిల్ వుడ్, మాలీవుడ్ దర్శక నిర్మాతలు కూడా ధైర్యం చేసి భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమాలు చేసారంటే అందుకు ముఖ్య కారణం బాహుబలి సిరీస్. ఈ సిరీస్ ని ఒకే సినిమాగా మార్చి ‘బాహుబలి : ది ఎపిక్'(Bahubali : The Epic) గా రీసెంట్ గానే రీ రిలీజ్ చేశారు. మొదటి రిలీజ్ లో ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో, రీ రిలీజ్ లో కూడా ఈ చిత్రం అంతటి ప్రభంజనం సృష్టించింది. ఇప్పటికీ ఈ సినిమా హైదరాబాద్ లోని ప్రసాద్ ఐమాక్స్ బిగ్ స్క్రీన్ లో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో రన్ అవుతోంది.
ప్రసాద్ బిగ్ స్క్రీన్ లో ఈ సినిమా గ్రాస్ వసూళ్లు కొత్త సినిమాలతో సమానంగా వచ్చాయి అనడం లో ఎలాంటి సందేహం లేదు. అయితే రీ రిలీజ్ లో దాదాపుగా థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం, వరల్డ్ వైడ్ గా ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాం. ముందుగా తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాల వారీగా ఈ సినిమాకు వచ్చిన గ్రాస్ వసూళ్లను ఒకసారి చూస్తే నైజాం ప్రాంతం నుండి 11.10 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, సీడెడ్ ప్రాంతం నుండి 2 కోట్ల 45 లక్షలు, ఆంధ్ర ప్రాంతం నుండి 8 కోట్ల 90 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాలకు కలిపి ఈ చిత్రానికి ఫుల్ రన్ లో 22 కోట్ల 45 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
ఇక మిగిలిన ప్రాంతాల విషయానికి వస్తే కర్ణాటక ప్రాంతం నుండి 4 కోట్ల 70 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినెమా, తమిళనాడు + కేరళ ప్రాంతం నుండి 4 కోట్ల 10 లక్షల రూపాయిలు రాబట్టింది. అదే విధంగా హిందీ + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 8 కోట్ల 20 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఓవర్సీస్ ప్రాంతం నుండి 12 కోట్ల 25 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ గా ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలకు కలిపి 52 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. వంద కోట్ల గ్రాస్ ని వసూలు చేస్తుందని అంతా అనుకున్నారు కానీ, ఇతర భాషల్లో ఈ చిత్రం ఆశించిన రేంజ్ గ్రాస్ ని రాబట్టలేకపోయింది.