Morning Tiredness Tips: కొంతమంది వైద్యులు చెబుతున్న ప్రకారం ప్రతి వ్యక్తి 8 గంటల పాటు నిద్ర పోతేనే సరైన ఆరోగ్యం. కానీ రకరకాల కారణాల వల్ల చాలామంది కనీసం 6 గంటలకు కూడా నిద్రపోవడం లేదు. దీంతో అనేక ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అయితే కొంతమంది మాత్రం ప్రత్యేకంగా సమయం కేటాయించి ఎనిమిది గంటల పాటు నిద్రపోతున్నారు. కానీ 8 గంటల పాటు నిద్రపోయినా కూడా ఉదయం ఆలస్యంగా లేస్తున్నారు. ఇలా ఆలస్యంగా లేవడానికి కారణమేంటి ? అని కొందరు తీవ్రంగా ఆలోచిస్తున్నారు. అయితే ఆరోగ్య నిపుణులు తెలుపుతున్న ప్రకారం ఇలా కావడానికి రెండు కారణాలు ఉన్నాయని అంటున్నారు. అవేంటో చూద్దాం..
నైట్ ఫుడ్:
ఉద్యోగం, వ్యాపారం రీత్యా కొందరు రాత్రులు ఆలస్యంగా భోజనం చేస్తున్నారు. ఇది కూడా హెవీగా ఉంటుంది. ఇలా ఎక్కువ క్యాలరీలు కలిగిన భోజనం చేసిన తర్వాత వెంటనే పడుకోవడం ద్వారా తిన్న ఆహారం సరైన క్రమంలో జీర్ణం కాకుండా ఉంటుంది. అంటే మనం పడుకునే సమయంలో ఈ ఆహారం జీర్ణం కావడానికి శరీరంలో అనేక ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలో శరీరం విశ్రాంతి తీసుకోదు. ఫలితంగా నిద్ర పట్టకుండా ఉంటుంది. పైకి నిద్ర పట్టినట్లు అనిపించిన అది నాణ్యమైన నిద్ర అవదు. అందువల్ల రాత్రి సమయంలో దాదాపుగా సాత్విక ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా మాంసాహారం లేదా ఎక్కువ క్యాలరీలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడం ఆపేయాలి. అలాగే నిద్రపోయే కనీసం గంట ముందు ఆహారం తీసుకోవాలి. ఆ తర్వాత చిన్నపాటి నడక లేదా కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేయాలి. ఇలా చేస్తే నాణ్యమైన నిద్రపట్టే అవకాశం ఉంటుంది.
మొబైల్ స్క్రోలింగ్:
చాలామంది ప్రస్తుత కాలంలో మొబైల్ చూస్తూ చూస్తూ నిద్రపోయేవారు ఉన్నారు. ఇలా మొబైల్ చూస్తూ ఉండేవారికి నాణ్యమైన నిద్ర పట్టి అవకాశం ఉండదు. ఎందుకంటే అప్పటివరకు మొబైల్ చూసిన వారి మనసులో ఆలోచనలు పర్యటితో ఉంటాయి. దీంతో నిద్రపట్టే అవకాశం ఉండదు. పైకి నిద్ర పోయినట్లు అనిపించిన ఇది నాణ్యంగా ఉండదు. అందువల్ల నిద్రపోయే గంట లేదా రెండు గంటల ముందు మొబైల్ ను పక్కన ఉంచాలి. కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ లేదా ధ్యానం చేయాలి. వీలైతే స్నేహితులను చూసి మాట్లాడుతుండాలి.
ఈ రెండు కారణాల వల్లే చాలామంది ఎనిమిది గంటలపాటు నిద్రపోయినా కూడా ఉదయం ఆలస్యంగా లేస్తుంటారు. ఎందుకంటే నిద్రపోయిన తర్వాత మెదడు అలాగే పని చేస్తూ ఉంటుంది. విశ్రాంతి తీసుకోదు. దీంతో ఆలస్యంగా నిద్ర పట్టి ఉదయం ఆలస్యంగా నిద్ర లేచేలా చేస్తుంది. ఈ క్రమంగా అలవాటుగా మారితే జీవ గడియారం దెబ్బతింటుంది. ఆ తర్వాత రోజంతా అలసటగా ఉండి సరైన విధంగా పనులు చేయలేరు.