Baahubali The Epic Release: మన టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ జోరు ఇంకా తగ్గలేదు. మూడేళ్ళ నుండి కొనసాగుతున్న ఈ ట్రెండ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు(Super Star Mahesh Babu), పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) సూపర్ హిట్ రీ రిలీజ్ చిత్రాలే సక్సెస్ అయ్యాయి. మిగిలిన వాళ్ళవి కూడా బాగానే ఆడాయి కానీ, ఆల్ టైం రికార్డ్స్ మాత్రం కేవలం ఈ ఇద్దరి హీరోల మధ్యనే తిరిగేవి. ప్రస్తుతానికి ఈ రీ రిలీజ్ ట్రెండ్ లో మొదటి రోజు రికార్డు పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ పేరిట ఉండగా, ఫుల్ రన్ రికార్డు మహేష్ బాబు ‘ఖలేజా’ పేరిట. ఈ రెండు రికార్డ్స్ ని బద్దలు కొట్టాలంటే మళ్లీ ఈ ఇద్దరి హీరోల సినిమాలకే సాధ్యమని చాలా మంది అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఇప్పుడు ప్రభాస్(Rebel Star Prabhas) రేస్ లోకి వచ్చాడు. ఆయన కెరీర్ లో మైల్ స్టోన్ గా నిల్చిన బాహుబలి సిరీస్ ని ‘బాహుబలి : ది ఎపిక్'(Bahubali : The Epic) పేరిట ఈ నెల 31న గ్రాండ్ గా రీ రిలీజ్ చేస్తున్నారు.
మేకర్స్ ఎక్కడా కూడా ఈ చిత్రాన్ని రీ రిలీజ్ లెక్క ఆడియన్స్ కి చూపించే ప్రయత్నం చేయడం లేదు. ఒక కొత్త సినిమాని ఎలా అయితే విడుదల చేస్తారో, ఆ విధంగానే ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. కానీ ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘గబ్బర్ సింగ్’ రీ రిలీజ్ రికార్డు ని అందుకోవడం అసాధ్యం అనే అనిపిస్తుంది. ఉదాహరణకు హైదరాబాద్ సిటీ లో ఈ చిత్రానికి ఇప్పటి వరకు 40 కి పైగా హౌస్ ఫుల్స్/ ఫాస్ట్ ఫిల్లింగ్స్ బుక్ మై షో యాప్ లో పడ్డాయి. కానీ ‘గబ్బర్ సింగ్’ చిత్రానికి ఏకంగా 140 షోస్ హైదరాబాద్ సిటీ లో సోల్డ్ అవుట్ అయ్యాయి. ఈ రికార్డు కి దరిదాపుల్లోకి కూడా వెళ్లలేకపోయింది ‘బాహుబలి: ది ఎపిక్’.
ఇక ఆంధ్ర ప్రదేశ్ లో అయితే పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. వైజాగ్ లాంటి సిటీస్ లో కూడా టికెట్స్ అమ్ముడుపోవడం లేదు. గబ్బర్ సింగ్ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు దాదాపుగా 8 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. బాహుబలి కి ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే తెలుగు రాష్ట్రాల నుండి 4 కోట్ల రూపాయిల గ్రాస్ కి మించి వసూళ్లు వచ్చేలా కనిపించడం లేదు. కేవలం ఓవర్సీస్ లో ఒక్కటే ఈ చిత్రం ప్రభంజనం సృష్టిస్తోంది. అన్ని ఫార్మట్స్ లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తుండడం తో ఒక్క నార్త్ అమెరికాలోనే ఈ చిత్రానికి దాదాపుగా మూడు లక్షల డాలర్లు వచ్చాయి. ఓవరాల్ వరల్డ్ వైడ్ వసూళ్లతో కలిపి ఈ చిత్రం ‘గబ్బర్ సింగ్’ ని అందుకునే అవకాశాలు ఉన్నాయి కానీ, ప్రస్తుతానికి కష్టమే.