Baahubali The Epic Advance Bookings: తెలుగు చలన చిత్ర పరిశ్రమకు బాహుబలి(Bahubali : The Epic) చిత్రం ఒక ట్రేడ్ మార్క్ లాంటిది. ట్రేడ్ వర్గాలు మన ఇండస్ట్రీ ని బాహుబలి కి ముందు, ఆ తర్వాత అని డివైడ్ చేసి మాట్లాడుతుంటారు. అందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. మన తెలుగు సినిమాకు పాన్ ఇండియా మార్కెట్ మాత్రమే కాదు, ఇంటర్నేషనల్ మార్కెట్ ని తెచ్చిపెట్టిన సినిమా ఇది. బాహుబలి పార్ట్ 1 ఒక అద్భుతం అనుకుంటే, బాహుబలి 2 అంతకు మించిన వెండితెర అద్భుతం. పార్ట్ 2 విడుదలై 8 ఏళ్ళు అయ్యింది. ఈ 8 ఏళ్ళల్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. పాన్ ఇండియా లెవెల్ లో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. కానీ బాహుబలి 2 కలెక్షన్స్ ని మాత్రం ఫుల్ రన్ లో అందుకోలేకపోయాయి అంటేనే అర్థం చేసుకోవచ్చు, ఆ సినిమా రేంజ్ ఏంటి అనేది.
Also Read: ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వంలో మిస్ అయిన మహేష్ బాబు సినిమా అదేనా?
ఇదంతా పక్కన పెడితే రాజమౌళి రెండు భాగాలను కలిపి ‘బాహుబలి : ఎపిక్’ పేరు తో 3 గంటల 45 నిమిషాల సినిమాని ఈ నెల 31న విడుదల చేయబోతున్నాడు. ఈ సందర్భంగా దీనికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో మొదలయ్యాయి. ముఖ్యంగా నార్త్ అమెరికా లో సెన్సేషనల్ అడ్వాన్స్ బుకింగ్స్ నమోదు అవుతున్నాయి. కేవలం 140 షోస్ ద్వారా 2 లక్షలకు పైగా అమెరికన్ డాలర్స్ వచ్చాయి. స్టార్ హీరోల కొన్ని కొత్త సినిమాలకు కూడా ఈమధ్య కాలం లో ఈ రేంజ్ అడ్వాన్స్ బుకింగ్స్ జరగలేదు. అందుకు ఉదాహరణగా ఈ ఏడాది విడుదలైన ‘వార్ 2’, ‘హరి హర వీరమల్లు’ చిత్రాలను పరిగణలోకి తీసుకోవచ్చు. ఇక హైదరాబాద్ లో అయితే 5 రోజులకు ముందే 250 షోస్ కి పైగా అడ్వాన్స్ బుకింగ్స్ ని మొదలు పెట్టారు. అప్పుడే కోటి రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయట.
అదే విధంగా కర్ణాటక, చెన్నై వంటి ప్రాంతాల్లో కూడా దుమ్ము లేచిపోయే రేంజ్ అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లో ఇంకా అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు అవ్వలేదు. ఒక్కసారి మొదలు అయ్యాక ఏ రేంజ్ గ్రాస్ వసూళ్లు వస్తాయో మీ ఊహలకే వదిలేస్తున్నాం. ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న లెక్కల ప్రకారం ఈ చిత్రానికి ఇప్పటి వరకు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా మూడు కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి. రాబోయే రోజుల్లో ఇంకా ఎంత గ్రాస్ ని రాబడుతుందో చూడాలి.