Baahubali : బాలీవుడ్ ని దశాబ్దాల పాటు తిరుగులేకుండా ఏలారు అమితాబ్ బచ్చన్. 90ల వరకు ఆయన హవా సాగింది. అసలు హీరోకి పనికి రావు అని అవకాశాల కోసం ప్రయత్నం చేసే రోజుల్లో అమితాబ్ ని పలువురు అవమానించారట. అలాంటి అమితాబ్ ఎలాంటి సినిమా నేపధ్యం లేకుండా పరిశ్రమలో అడుగుపెట్టి ఎదిగారు. స్టార్డం తగ్గాక, వయసు మీద పడ్డాక అమితాబ్ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీస్ చేసి సక్సెస్ అయ్యారు. పింక్, బద్లా వంటి చిత్రాలు అమితాబ్ కెరీర్ మరింత కాలం నడిచేలా చేసాయి. ఇక ప్రభాస్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ కల్కి లో హీరోకి సమానమైన పాత్ర ఆయన చేయడం విశేషం. అమితాబ్-ప్రభాస్ మధ్య వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ అలరించాయి.
Also Read :బాహుబలి సినిమాను మధ్యలోనే ఆపేయాలని అనుకున్నారా..?కారణం ఏంటి..?
అయితే అమితాబ్ కెరీర్లో డాన్ మైలురాయి లాంటి చిత్రంగా నిలిచిపోయింది. 1978లో విడుదలైన డాన్ మూవీ నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. కెరీర్లో మొదటిసారి అమితాబ్ మాఫియా డాన్ రోల్ చేశాడు. అలాగే ఈ చిత్రంలో ఆయన ద్విపాత్రాభినయంలో అలరించాడు. డాన్ మూవీ అమితాబ్ కి విపరీతమైన మాస్ ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది. డాన్ మూవీలో అమితాబ్ చెప్పిన ‘డాన్ కో పకడ్నా ముష్కిల్ హి నహీ’ ఎప్పటికీ ఫేమస్. కాగా డాన్ మూవీ చిత్ర విశేషాలు ఎన్నో ఉన్నాయి.
డాన్ మూవీ నిర్మాత నారిమన్ ఇరాని అప్పుల్లో కూరుకుపోయి ఉన్నారు. ఆయన్ని ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడేయాలని అమితాబ్ ఈ మూవీ ఉచితంగా చేశారు. ఆయన ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. అలాగే దర్శకుడు చంద్ర బరోట్, హీరోయిన్ జీనత్ అమన్ సైతం రెమ్యూనరేషన్ తీసుకోలేదట. డాన్ మూవీ బడ్జెట్ రూ. 1 కోటి. బ్లాక్ బస్టర్ టాక్ తో డాన్ వరల్డ్ వైడ్ రూ. 7 కోట్లు వసూలు చేసింది. ఇప్పటి లెక్కల్లో రూ. 250 కోట్లు అని చెప్పొచ్చు. రూపాయి పెట్టుబడికి ఏడు రెట్లు లాభం డాన్ తెచ్చిపెట్టింది.
నారిమన్ ఇరాని అంతకు ముందు తీసిన జిందగీ జిందగీ మూవీ ఫెయిల్ కావడంతో రూ. 12 లక్షలు అప్పు పడ్డాడట. దాంతో అమితాబ్, చంద్ర, జీనత్ ఆయన కోసం ఒక చిత్రం ఉచితంగా చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే డాన్ మూవీ షూటింగ్ మూడేళ్లు పట్టింది. డాన్ మూవీ షూటింగ్ సమయంలో ప్రమాదంలో నారిమన్ ఇరాని మరణించాడు. డాన్ సక్సెస్ ని ఆయన చూడలేకపోయారు. ఆయన మరణంతో డాన్ మూవీ టీమ్ కి గట్టి దెబ్బ తగిలింది. అయినప్పటికీ పట్టుదలతో డాన్ మూవీ తెరకెక్కించి విడుదల చేశారు.
డాన్ మూవీ విడుదలైన మొదటివారం పెద్దగా స్పందన లేదు. ప్లాప్ టాక్ కూడా వచ్చింది. రెండో వారం నుండి పుంజుకున్న డాన్ మూవీ ఏకంగా 50 వారాలు థియేటర్స్ లో ఆడింది. సినిమా విడుదల తర్వాత జోడించిన ‘ఖైకే పాన్ బనా రసవాలా’ సాంగ్ మరింత ప్లస్ అయ్యింది. మొత్తంగా డాన్ మూవీ అనేక సరికొత్త రికార్డులు నెలకొల్పింది.
Also Read : బాహుబలి 2, పుష్ప 2 కాదు..70 కోట్లతో సినిమా తీస్తే ఏకంగా 2000 కోట్లను వసూలు చేసిన సినిమా ఏంటో తెలుసా..?