Baahubali తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రభాస్ లాంటి స్టార్ హీరోకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఇక ఆయన చేసిన బాహుబలి సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియాలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకోవడమే కాకుండా భారీ రేంజ్ లో ఎలివేట్ అయ్యాడు. బాహుబలి (Bahubali) సినిమాతో రాజమౌళి(Rajamouli) క్రియేట్ చేసిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఆయన మైండ్ లో ఉన్న విజువల్స్ ను స్క్రీన్ మీద ప్రజెంట్ చేయడంలో ఆయన సూపర్ సక్సెస్ అయ్యాడనే విషయమైతే చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇక ఇదిలా ఉంటే రాజమౌళి ఈ సినిమాని స్టార్ట్ చేసినప్పుడు సినిమా బడ్జెట్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. ఇండియాలోనే భారీ బడ్జెట్ గా మారబోతుంది మరి ఇంత బడ్జెట్ ని హ్యాండిల్ చేయగలమా అలాగే మనం పెట్టిన డబ్బులు రిటర్న్ వస్తాయా లేదా అనే ధోరణిలో కొన్ని అనుమానాలైతే వ్యక్తం అయ్యాయట. ఇక ప్రభాస్ లాంటి స్టార్ హీరోనే ఈ విషయాన్ని బయట పెట్టడం విశేషం…
మరి ఏది ఏమైనా కూడా ప్రభాస్ లాంటి స్టార్ హీరోతో బాహుబలి సినిమా వర్కౌట్ కాదని రాజమౌళి కూడా భావించారట. కానీ ప్రొడ్యూసర్ మాత్రం బడ్జెట్ ఎంతైనా పర్లేదు చేసేయండి అని ఒక నమ్మకం ఇవ్వడంతో రాజమౌళికి, అటు ప్రభాస్ కి నమ్మకం వచ్చి సినిమాని రెండు పార్టులుగా చేసి భారీ విజయాన్ని అందుకున్నారు.
మరి మొత్తానికైతే విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రొడ్యూసర్స్ లేకపోతే మధ్యలోనే ఆగిపోయేదనేది వాస్తవం…ఇక ఇదిలా ఉంటే రాజమౌళి తన తాలూకు స్టామినాని చూపించడమే కాకుండా విజువల్ వండర్స్ ను చేసి భారీ సక్సెస్ ని సాధించవచ్చు అని ప్రూవ్ చేశాడు. ఇక ఈ సినిమా వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు తెలుగు సినిమా దర్శకులందరు పాన్ ఇండియా సినిమాలను చేస్తూ భారీ విజయాలను సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు.
ఇక బాహుబలి 2 సినిమా మాత్రం 1850 కోట్ల కలెక్షన్లు కా రాబట్టి పెను ప్రభంజనాలను సృష్టించిందనే చెప్పాలి. ఇక ఈ సినిమా తర్వాత రాజమౌళి (Rajamouli) ఎన్టీఆర్(NTR) రామ్ చరణ్ (Ram Charan) లను పెట్టి ‘త్రిబుల్ ఆర్’ (RRR) అనే సినిమా చేసిన విషయం మనకు తెలిసిందే… ఇక ఈ సినిమా కూడా 1300 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టి రాజమౌళి పేరు మరోసారి పాన్ ఇండియా లెవెల్లో వినిపించేలా చేసింది…