
Mani Ratnam : దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా కేవలం కొత్త దర్శకులకు మాత్రమే కాదు.లెజండరీ దర్శకులకు కూడా ఒక దిక్సూచి లాంటిది.ఈ సినిమా ఇచ్చిన నమ్మకం తోనే సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ఈమధ్య భారీ సినిమాలు వస్తున్నాయి.ఒక్క మాటలో చెప్పాలంటే ఇండియన్ సినిమా స్థాయిని హాలీవుడ్ రేంజ్ కి తీసుకెళ్లిన ఘనుడు ఆయన.
అందుకే రాజమౌళి ని మన దేశానికి విలువైన సంపద అని అందరూ అంటూ ఉంటారు.రీసెంట్ గా మణిరత్నం లాంటి లెజెండరీ దర్శకుడు కూడా రాజమౌళి ని పొగడతలతో ముంచి ఎత్తేసాడు.గత ఏడాది ఆయన తీసిన పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1 ఎంత పెద్ద భారీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే.తమిళనాడు ప్రజలు గర్వం గా ఇది మా సినిమా అని చెప్పుకునే రేంజ్ తీసి బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసాడు మణిరత్నం.
రీసెంట్ గా ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో పొన్నియన్ సెల్వన్ తియ్యడానికి ఆదర్శం రాజమౌళి గారే అంటూ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.ఆయన మాట్లాడుతూ ‘పొన్నియన్ సెల్వన్ సినిమా తియ్యాలి అనేది నా కల..దశాబ్దం క్రితమే ఈ సినిమాని తియ్యాలని ప్రణాళికలు చేసుకున్నాను..కానీ అప్పట్లో మన మార్కెట్ ఇంత లేదు, బడ్జెట్ సహకరించకపోవడం తో ఆ సినిమాని తియ్యాలనే ఆలోచనని పక్కన పెట్టేసాను.కానీ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా ఇండస్ట్రీ రికార్డ్స్ ని తిరగరాసేలోపు నాలో నమ్మకం ప్రారంభం అయ్యింది.బాహుబలి చిత్రాన్ని రెండు భాగాలుగా తీసాడు రాజమౌళి.పొన్నియన్ సెల్వన్ కథ ఒక్క సినిమా తో చెప్పేది కాదు, రెండు భాగాలుగా చెప్పాలి..నా దగ్గర పకడ్బందీ స్క్రిప్ట్ ఉంది.బాహుబలి సక్సెస్ అయ్యింది, మనది కూడా సక్సెస్ అవుతుంది అనే నమ్మకం తో అడుగు ముందుకు వేసాను’ అంటూ మణిరత్నం చెప్పిన మాటలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.