https://oktelugu.com/

జబర్ధస్త్ నిర్వాహకులకు షాక్ ఇచ్చిన అవినాష్ !

ఈటీవీలో ప్రసారమయ్యే జబర్ధస్త్ అనే ప్రోగ్రామ్ ద్వారా చాలామంది కమెడియన్స్ వెలుగులోకి వచ్చారు. మంచి పాపులారిటీని సొంతం చేసుకున్నారు. అలా కమెడియన్‌ గా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తుల్లో ముక్కు అవినాష్ కూడా ఒకడు. ఎన్నో స్కిట్లలో నవ్వించి అందర్నీ మెప్పించిన అవినాష్.. ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాడు. మనోడి గురించి ఓ కథనం బాగా షేర్ అవుతుంది. ఇంతకీ ఏంటంటే అది.. అవినాష్ బిగ్ బాస్ హౌస్ లోకి చాలా […]

Written By:
  • admin
  • , Updated On : December 16, 2020 / 09:45 AM IST
    Follow us on


    ఈటీవీలో ప్రసారమయ్యే జబర్ధస్త్ అనే ప్రోగ్రామ్ ద్వారా చాలామంది కమెడియన్స్ వెలుగులోకి వచ్చారు. మంచి పాపులారిటీని సొంతం చేసుకున్నారు. అలా కమెడియన్‌ గా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తుల్లో ముక్కు అవినాష్ కూడా ఒకడు. ఎన్నో స్కిట్లలో నవ్వించి అందర్నీ మెప్పించిన అవినాష్.. ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాడు. మనోడి గురించి ఓ కథనం బాగా షేర్ అవుతుంది. ఇంతకీ ఏంటంటే అది.. అవినాష్ బిగ్ బాస్ హౌస్ లోకి చాలా కష్టపడ్డాడట. బిగ్ బాస్ కి వెళ్లడానికి జబర్దస్త్ నిర్వాహకులు మొదట ఒప్పుకోలేదు అట.

    Also Read: థియేటర్లు కనుమరుగు.. అమెజాన్ గోడౌన్లుగా మార్పు

    పైగా అవినాష్ ను కొంచెం ఇబ్బంది కూడా పెట్టారని, ఆ ఇబ్బందులు అధిగమించడానికి అతను అప్పు కూడా చేయాల్సి వచ్చిందని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ వార్తలు నిజమే అని తెలుస్తోంది. ఎందుకంటే ఆ వార్తలు నిజం కాకపోయి వుంటే.. అవినాష్ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన వెంటనే.. మళ్లీ జబర్దస్త్ షోకి వెళ్లివాడని.. కానీ అలా అవినాష్ ఆ షోలో కనిపించడం లేదు కనుక.. ఇక అతను జబర్దస్త్ కు బాయ్ చెప్పేసినట్లే అని తెలుస్తోంది. మొత్తానికి జబర్దస్త్ నిర్వాహకుల వైఖరికి అవినాష్ బాగానే బాధపడినట్లు ఉన్నాడు.

    Also Read: తనకు ఇల్లును గిఫ్ట్ గా ఇవ్వడం పై రకుల్ వివరణ !

    కాగా అవినాష్ ఇప్పుడు మాటీవీకి దగ్గరయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అవినాష్ మా టీవీలో ఓ మాంచి షో చేసే దిశగా డిస్కషన్లు, ఆలోచనలు చేస్తున్నాడట. అనుకున్న ప్లాన్ లు అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలో మా టీవీలో అవినాష్ షో మొదలు అవ్వడం ఖాయం అంటున్నారు. ఏది ఏమైనా ఎంటర్ టైన్ మెంట్ ఇవ్వడంలో మనోడు ఎక్కడా వెనక్కి తగ్గడు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్