వైఎస్ జగన్ తో ఘర్షణ వైఖరి కంటే ఆయనతో స్నేహంగా ఉండటమే మంచిదని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో స్నేహం కోసం బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించింది. జగన్‌తో స్నేహ సంబంధాలు కొనసాగించడం వైపే కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీ ఆసక్తి చూపుతోంది. అందుకే జగన్ పిలిచి మరీ మాట్లాడుతున్నారు కమలం పార్టీ నేతలు.
Also Read: జగన్, కేసీఆర్ దెబ్బ: హైకోర్టు సీజేలే మారిపోయారే? ఏంటి కథ?
అయితే చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉండేది. అప్పట్లో మోదీని కలవడానికి చంద్రబాబు పడరాని పాట్లు పడేవారు. చంద్రబాబును బీజేపీ నేతలు నమ్మడం లేదని మరోసారి స్పష్టం అయ్యింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరుసగా రెండోసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత.. ఇందులో కీలక మార్పులను చేశారు. అంతకుముందు ప్రధాని అన్ని వ్యవహారాలు చక్కబెట్టేవారు. ఈసారి హోం శాఖ మంత్రి అమిత్ షాని కేంద్రంలో ఆ బాధ్యతలు అప్పగించారు. అనంతరం ప్రణాళిక సంఘంలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు మోదీ. దక్షిణాది రాష్ట్రాల నుంచి వైఎస్ జగన్ ఒక్కరికే ఈ కమిటీలో చోటు కల్పించడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్నట్టయింది.
Also Read: అమరావతికి సోము వీర్రాజు జై.. జగన్ ను టార్గెట్ చేసిన చంద్రబాబు
వైఎస్ జగన్ కంటే పరిపాలనలో అనుభవం ఉన్న మరో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరును పరిశీలనలోకి తీసుకోలేదు. ఏ పదవిని భర్తీ చేయాలన్నా రాజకీయ కోణంలో చూసే అలవాటు బీజేపీకి ఉందని, అలాంటి పార్టీ ఇద్దరు తటస్థ ముఖ్యమంత్రులకు కీలక పదవుల్లో నియమించడం వెనుక రాజకీయ కారణాలు లేవన్న విషయాన్ని కొట్టి పారేయలేమనే పలువురు అభిప్రాయ పడుతున్నారు.
అదే చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ప్రధానిని కలవడానికి ఇబ్బందులుపడేవారు. అనేక సార్లు చంద్రబాబు ఢిల్లీకి వెళ్లిన బీజేపీ నేతలు పట్టించుకోలేదు. ఓ దశలో గుజరాత్ లో చిన్న కార్యక్రమంలో పాల్లొన్న మోదీని కలవడానికి చంద్రబాబు వెళ్లారు. అయిన కూడా మోదీ చంద్రబాబుకు ప్రాధాన్యం ఇవ్వలేదట. ఇప్పడు మాత్రం జగన్ పిలిచి మరీ మాట్లాడుతున్నారు కమలం పార్టీ నేతలు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్