Avika Gour: చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ ద్వారా బాల్యం నటిగా ఎంతో మంది అభిమానులను గెలుచుకున్నారు అవికా గోర్. టాలీవుడ్ సినీ పరిశ్రమకు ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యారు. ఈ చిత్రం ప్రేక్షకులలో మంచి విజయం సాధించింది ఆ తర్వాత వచ్చిన ‘సినిమా చూపిస్త మామ, రాజుగారి గది 3, ఎక్కడికి పోతావు చిన్నవాడా వంటి చిత్రాల్లో హీరోయిన్ గుర్తింపు పొందింది. నవీన్ చంద్ర అవికా గోర్ కాంబోలో తెరకెక్కిన ‘బ్రో ‘ మూవీ త్వరలో ఓటిటి వేదికగా విడుదల కానుంది. ఈ తరుణంలో సినిమా విశేషాలను ముచ్చటించారు చిత్ర బృందం.

నవీన్ చంద్ర,అవికా గోర్ అన్నా చెల్లెల అనుబంధంతో దర్శకుడు కార్తిక్ రూపొందిన చిత్రం ‘బ్రో ‘ మరాఠీ చిత్రం ‘హ్యాపీ జర్నీ’కి రీమేక్ గా తెరకెక్కించారు త్వరలో సోని లివ్ వేదికగా ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సందర్భంగా అవికా మాట్లాడుతూ…ఈ మూవీలో కొన్నిసన్నివేశాలు చేసేటప్పుడు భావోద్వేగానికి గురయ్యి సెట్‌లోనే ఏడ్చాను కొన్నిసార్లు కడుపుబ్బా నవ్వాను అంటూ సాధారణంగా అన్న చెల్లి అంటేనే టామ్ అండ్ జెర్రీలా సరదాగా గొడవ పడుతూ ఉంటారు.
అయితే ‘#బ్రో ‘చిత్రం కాస్త విభిన్నంగా ఉంటుందని తోబుట్టువులు ఎటువంటి సందర్భంలోనైనా ఒకరికి ఒకరు అండగా ఉండాలనే మంచి సందేశంతో రూపొందిన చిత్రం.ప్రేక్షకులందరికీ నచ్చుతుందని చెప్పుకొచ్చారు ముద్దుగుమ్మ.నవీన్‌చంద్ర మాట్లాడుతూ కొవిడ్ సమయంలో అనేక ఇబ్బందుల మధ్య అరకులో షూటింగ్ పూర్తి చేశాం’’ అని చెప్పారు దర్శకుడు కార్తిక్ మాట్లాడుతూ 36 రోజుల్లో షూటింగ్ పూర్తి చేశాం అని ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని చెప్పుకొచ్చారు.