Avatar 3 Collection Day 1: జేమ్స్ కెమరూన్(James Cameron) దర్శకత్వం వహించిన ‘అవతార్ 3 : ది ఫైర్ & యాష్'(Avatar 3 : The Fire & Ash) చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదలై మొదటి ఆట నుండే డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. కొంతమంది విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి కానీ, స్టోరీ లైన్ రొటీన్ గా ఉందని కామెంట్స్ చేయగా, కొంతమంది అయితే యాక్షన్ సన్నివేశాలు రెండవ భాగం కంటే ది బెస్ట్ గా ఉన్నాయని కామెంట్స్ చేశారు. మరికొంతమంది అయితే మూడు గంటల సినిమా మా సహనానికి పరీక్ష పెట్టింది, జేమ్స్ కెమరూన్ నుండి డిజాస్టర్ కంటెంట్ చిత్రం వచ్చింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా ఈ సినిమా గురించి చెప్తున్నారు. కానీ ఈ టాక్ ఓపెనింగ్స్ పై ఎలాంటి ప్రభావం చూపించలేకపోయింది. అవతార్ సినిమాకు వరల్డ్ వైడ్ గా ఉన్నటువంటి బ్రాండ్ విలువ అలాంటిది మరి.
ముందుగా మన ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రానికి మొదటి రోజు ఎంత గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశం ఉందో ఒకసారి విశ్లేషిద్దాం. బుక్ మై షో యాప్ లో ప్రస్తుతం ఈ చిత్రానికి గంటకు 21 వేల టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. అన్ని భాషలకు కలిపి , అవతార్ రేంజ్ కి ఇది తక్కువే, కానీ మొదటి రోజు ఇండియా వైడ్ గా ఈ చిత్రానికి 30 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న సమాచారం ప్రకారం చూస్తే, ఈ చిత్రానికి మొదటి రోజుకు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా బుక్ మై షో + డిస్ట్రిక్ట్ యాప్స్ కలిపి 3 లక్షలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి అట. కేవలం బుక్ మై షో యాప్ నుండి గడిచిన 24 గంటల్లో 1 లక్షా 85 వేల టిక్కెట్లు అమ్ముడుపోయినట్టు సమాచారం.
అంతే కాకుండా వీకెండ్ వరకు ఈ చిత్రానికి ఇండియా వైడ్ గా బుక్ మై షో యాప్ ద్వారా 6 లక్షల 50 వేల టిక్కెట్లు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా అమ్ముడుపోయాయి అట. అంటే వీకెండ్ లోపు ఇండియా నుండే ఈ చిత్రానికి వంద కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు రాబోతున్నాయి అన్నమాట. ఇక వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి మొదటి రోజున 250 మిలియన్ కి పైగా గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అదే కనుక జరిగితే ఈ చిత్రానికి ఇండియన్ కరెన్సీ ప్రకారం చూస్తే మొదటి రోజే 3000 వేల కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు లెక్క. కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఈ సినిమాకు 100 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయట.