Avatar 3 First Review: మరో రెండు రోజుల్లో ‘అవతార్ 3′(Avatar 3: Fire And Ash) చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తెలుగు స్టేట్స్ లో అవతార్ మొదటి రెండు సినిమాలకు విడుదలకు ముందు ఉన్న క్రేజ్ మామూలుది కాదు. సెన్సేషనల్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకోవడం మాత్రమే కాకుండా, ఫుల్ రన్ లో కూడా దుమ్ము లేపేసింది. అవతార్ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి 23 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, ‘అవతార్ 2’ చిత్రానికి 107 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇది కేవలం తెలుగు రాష్ట్రాల నుండి మాత్రమే. ఇండియా వైడ్ గా అయితే ‘అవతార్ 2’ కి ఫుల్ రన్ లో 400 కోట్ల రూపాయలకు పైగానే గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అయితే రెండవ భాగానికి మొదటి భాగం తో పోలిస్తే టాక్ రాలేదు. జేమ్స్ కెమరూన్ బలహీనమైన వర్క్స్ లో ఒకటిగా ‘అవతార్ 2’ ని చెప్పుకొచ్చారు.
కానీ భారీ క్రేజ్ ఉండడం వల్ల ఆ సినిమా కమర్షియల్ గా ఆ రేంజ్ లో క్లిక్ అయ్యింది. కానీ ‘అవతార్ 3’ కి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఇండియా వైడ్ గా కూడా ఆశించిన స్థాయి క్రేజ్ లేదు. దానికి తోడు ఈ సినిమాకు సంబంధించిన టాక్ కూడా సోషల్ మీడియా లో లీక్ అయ్యింది. మొన్న రాత్రి జేమ్స్ కెమరూన్ మీడియా ప్రతినిధులకు ‘అవతార్ 3’ స్పెషల్ ప్రీమియర్ షో వేసి చూపించాడట. ఈ ప్రీమియర్ షో నుండి ఈ చిత్రానికి నెగిటివ్ టాక్ వచ్చింది. జేమ్స్ కెమరూన్ కథ ని పూర్తిగా పక్కన పెట్టి, కేవలం విజువల్స్ తో ఈ సినిమాని లాగించేద్దాం అనుకున్నట్టుగా సినిమా ఉందని అంటున్నారు. స్క్రీన్ ప్లే చాలా నిదానంగా ఉందట. ఒకే లైన్ మీద అవతార్ 2 తోనే సినిమాని ముగించేయొచ్చు. అలాంటిది జేమ్స్ కెమరూన్ ఎందుకు ఇంత సాగదీసాడు అంటూ సోషల్ మీడియా లో టాక్ బాగా వైరల్ అయ్యింది.
ఆడియన్స్ నుండి కూడా ఈ చిత్రానికి ఇలాంటి టాక్ వస్తే మాత్రం, ఈ సినిమా ఫుల్ రన్ లో రెండు బిలియన్ డాలర్లను కూడా అందుకోదు అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇకపోతే ఈ సినిమాకు ఓపెనింగ్ వసూళ్లు 240 నుండి 270 మిలియన్ డాలర్ల వరకు వస్తుందని అంచనా వేస్తున్నారు. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం చూస్తే 2000 కోట్ల నుండి 2250 కోట్ల వరకు ఉంటుందట. ఇండియా లో పెద్దగా క్రేజ్ లేకపోయినా, చైనా దేశం లో ఈ చిత్రానికి విపరీతమైన క్రేజ్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఈ చిత్రానికి 95 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలకు కలిపి వచ్చాయట.