Dhurandhar Collection Day 12: ఈ ఏడాది చివర్లో బాక్స్ ఆఫీస్ వద్ద ‘దురంధర్'(Dhurandhar Movie) చిత్రం క్రియేట్ చేస్తున్న రికార్డ్స్ ని చూసి ట్రేడ్ విశ్లేషకులకు కూడా నోటి నుండి మాట రావడం లేదు. మొదటి రోజు లేదా వీకెండ్స్ లో వచ్చే వసూళ్లు, ఈ చిత్రానికి వర్కింగ్ డేస్ లో వస్తున్నాయి. ఇదే అందరికీ మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తుంది. బుక్ మై షో యాప్ లో నేడు కూడా ఈ చిత్రానికి గంటకు పాతిక వేల టిక్కెట్లు అమ్ముడుపోతున్నాయి. వర్కింగ్ డేస్ లో గంటకు పది వేల టిక్కెట్లు అమ్ముడుపోతేనే అబ్బో అని అనుకునే రోజులివి. అలాంటిది ఒక సినిమాకు వర్కింగ్ డేస్ లో కూడా గంటకు పాతిక వేలకు పైగా టిక్కెట్లు అమ్ముడుపోతున్నాయంటే హిస్టారికల్ బ్లాక్ బస్టర్ అని అనకుండా, ఇంకేమి అనాలి చెప్పండి?. విడుదలై 12 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ఎంత వసూళ్లు వచ్చాయో ఒకసారి చూద్దాం.
ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న లెక్కల ప్రకారం 12 వ రోజున ఈ చిత్రానికి 32 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లు వచ్చాయి. ఇది సాధారణమైన విషయం కాదు. మొదటి రోజు ఈ చిత్రానికి కేవలం 28 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. అలాంటిది ఈ సినిమాకు 12 వ రోజున మొదటి రోజు కంటే ఎక్కువ వసూళ్లు రావడం నిజంగా అద్భుతం అనే చెప్పాలి. ఓవరాల్ గా ఇండియా వైడ్ గా ఈ చిత్రానికి 428 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయట. రెండవ వీకెండ్ మొదలు నుండి చూస్తే 8వ రోజున 34 కోట్ల 70 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకు, 9వ రోజున 53 కోట్ల 70 లక్షలు, 10 వ రోజున 58 కోట్ల 20 లక్షలు, 11 వ రోజున 31 కోట్ల 80 లక్షలు, 12 వ రోజున 32 కోట్ల 10 లక్షల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి.
ఇక ఓవర్సీస్ లో అయితే 12 రోజులకు గాను 130 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు సమాచారం . ఓవరాల్ గా 12 రోజులకు ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా వచ్చిన గ్రాస్ 607 కోట్ల రూపాయిల వరకు ఉంటుందని సమాచారం. ఈ వీకెండ్ తో ఈ చిత్రం వెయ్యి కోట్ల మార్కుకి చాలా దగ్గరగా వెళ్లబోతుంది . ఫుల్ రన్ లో పుష్ప 2 క్లోజింగ్ గ్రాస్ ని దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇదంతా కేవలం సింగిల్ వెర్షన్ నుండి వస్తున్న వసూళ్లు మాత్రమే. తెలుగు,తమిళం మరియు ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేసుంటే ఇంకా ఎంత గ్రాస్ వచ్చేదో మీరే ఊహించుకోవచ్చు.