Avatar 2 Collections: ప్రపంచంలో ఉన్న సినీ అభిమానులు మొత్తం ఇప్పుడు అవతార్ 2 కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ వచ్చారు.. డైరెక్టర్ జేమ్స్ కెమరూన్ ఈ చిత్రం కోసం ఏకంగా 12 ఏళ్ళ సమయాన్ని వెచ్చించారు..అవతార్ పార్ట్ 1 తియ్యడానికి ఆయన పదేళ్ల సమయం తీసుకుంటే, పార్ట్ 2 తియ్యడానికి ఏకంగా 12 ఏళ్ళ సమయం తీసుకున్నాడు..అప్పటి తో పోలిస్తే ఇప్పుడు టెక్నాలజీ బాగా మారిపోయింది.

ఐమాక్స్ , 4DX స్క్రీన్స్ కూడా వచ్చేసాయి..కాబట్టి అన్నీ ఫార్మట్స్ లోకి ఈ సినిమాని మార్చారు..ప్రేక్షకులు థియేటర్స్ కి వచ్చి తిరిగి వెళ్ళేటప్పుడు ఒక సరికొత్త లోకం లోకి ప్రవేశించి వచ్చామా అనే అనుభూతిని రప్పించడమే జేమ్స్ కెమరూన్ ముఖ్య ఉద్దేశ్యం.. అవతార్ 2 ని చూసిన ప్రేక్షకులు కూడా అదే థ్రిల్ కి గురైయ్యారు..కాని పార్ట్ 1 కి ఏరేంజ్ టాక్ వచ్చిందో..పార్ట్ 2 కి మాత్రం ఆ రేంజ్ టాక్ రాలేదనే చెప్పాలి.
ఈ చిత్రం విడుదలకు మూడు రోజుల ముందే ప్రీమియర్ షోస్ పలు ప్రాంతాలలో వేశారు..పాజిటివ్ టాక్ అయితే వచ్చింది కానీ, సినిమా నిడివి బాగా ఎక్కువైందనే టాక్ వచ్చింది..చాలావరకు సన్నివేశాలను సాగదీశారు అనే టాక్ కూడా ఉంది..కానీ థియేట్రికల్ అనుభూతి మాత్రం అద్భుతం అనే టాక్ వచ్చింది..ముఖ్యంగా ఐమాక్స్ 3D ఫార్మాట్ లో మాత్రం ఈ సినిమాని మిస్ అవ్వొద్దు అని చూసిన ప్రతీ ప్రేక్షకుడు చెప్తున్నాడు..అయితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 16 వేల కోట్ల రూపాయిలు వసూలు చెయ్యాలి..అంటే 3 బిలియన్ డాలర్స్ కి పైనే వసూళ్లను రాబట్టాలి అన్నమాట.

జేమ్స్ కెమరూన్ దర్శకత్వం వహించిన టైటానిక్ చిత్రం 1997వ సంవత్సరం లోనే 2 బిలియన్ డాలర్స్ కి పైగా వసూళ్లను రాబట్టింది..ఆ తర్వాత ఆ కలెక్షన్స్ ని కేవలం అవతార్ మాత్రమే దాటింది..2009వ సంవత్సరం లో విడుదలైన అవతార్ చిత్రం దాదాపుగా 3 బిలియన్ డాలర్ల వసూళ్లను రాబట్టింది..ఇలా జేమ్స్ కెమరూన్ సినిమా విడుదలైనప్పుడల్లా హాలీవుడ్ మార్కెట్ డబుల్ అవుతూ వచ్చింది..ఇప్పుడు అవతార్ 2 కూడా అలాంటి ఫీట్ ని రిపీట్ చెయ్యబోతుందా లేదా అనేది చూడాలి.