Homeఎంటర్టైన్మెంట్Avatar 2: రిలీజుకు రెడీ అవుతున్న ‘అవతార్ 2’.. హిట్ అవుతుందా ?

Avatar 2: రిలీజుకు రెడీ అవుతున్న ‘అవతార్ 2’.. హిట్ అవుతుందా ?

Avatar 2: ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరాన్ తెరకెక్కించిన అద్భుత దృశ్యకావ్యం ‘అవతార్’. సినిమా చరిత్రలోనే ‘అవతార్’కు ప్రత్యేకమైన స్థానం ఉంది. విజువల్ వండర్ తెరకెక్కిన ఈ మూవీ కలెక్షన్ల పరంగానూ సరికొత్త ప్రపంచ రికార్డులను నెలకొల్పింది. ఈ’ సినిమా చూసిన వారందరికీ సరికొత్త లోకాన్ని ‘అవతార్’ పరిచయం చేసింది.

‘అవతార్’ మూవీ ఐదు భాగాలుగా రానుందని దర్శకుడు జేమ్స్ కామెరాన్ గతంలోనే ప్రకటించారు. అవతార్ మొదటి పార్ట్ ఇప్పటికే విడుదలై సూపర్ హిట్టుగా నిలిచింది. ఈక్రమంలోనే అవతార్ 2ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కరోనా కారణంగా పలుసార్లు అవతార్ 2 రిలీజ్ డేట్స్ పోస్ట్ పోన్ అయిన సంగతి తెల్సిందే.

అయితే తాజాగా మూవీ మేకర్స్ అవతార్ 2 రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు. ఈ ఏడాది డిసెంబర్ 16న ప్రపంచ వ్యాప్తంగా అవతార్ 2 రాబోతుందని వెల్లడించారు. మరోవైపు మూడో పార్ట్ చివరి దశకు చేరుకుంది. అవతార్ మూడో భాగాన్ని 2024లో డిసెంబర్ లో, నాలుగో భాగాన్ని 2026 డిసెంబర్ లో, ఐదో పార్ట్ 2028లో విడుదల చేసేందుకు సన్నహాలు చేస్తున్నారు. ఈ స్వికెల్స్ లో కొత్త నటులు వచ్చి చేరనున్నారు.

అవతార్ 2 మూవీ రిలీజు డేట్ ప్రకటించడంతో ఈ మూవీ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. అదే సమయంలో ఇండియన్ సినిమాలు తమ రిలీజు డేట్స్ పై ముందస్తుగానే కసరత్తులు చేసుకుంటున్నాయి. ‘అవతార్’ మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టనుండటంతో ఈ సినిమా ఇండియన్ రైట్స్ ను దక్కించుకునేందుకు బడా నిర్మాతలు పోటీపడుతున్నారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

1 COMMENT

  1. […] Rich Tamil Heroes: తమిళ తెర పై ఎల్లప్పుడూ సమాజం పై ప్రేక్షకుల పై బలమైన ముద్ర వేసే సినిమాలు, వెబ్ సిరీస్‌ లే ఎక్కువుగా వస్తూ ఉంటాయి. అందుకు ప్రధాన కారణం.. ఆ చిత్రాల కథానాయకుల విభిన్న శైలితో పాటు బాక్సాఫీస్ పై వారికీ ఉన్న పట్టు కూడా ఓ కారణం. ఏ వినూత్న సినిమా తీసినా ఆ కథలో ఆ కథానాయకుడిని తమిళ ప్రజలు ఆదరిస్తారు. అందుకే, తమిళ హీరోల చిత్రాల కొత్తదనంతో పాటు కమర్షియల్ గానూ సక్సెస్ అవుతాయి. […]

Comments are closed.

Exit mobile version