HomeతెలంగాణComplete Life Story of Ramanujacharya: రామానుజుల వారి పూర్తి చరిత్ర

Complete Life Story of Ramanujacharya: రామానుజుల వారి పూర్తి చరిత్ర

-సమతామూర్తి (స్టాట్యూ ఆఫ్ ఈక్వీటీ) విగ్రహా విశేషాలు

– సమతామూర్తి విగ్రహాన్ని చైనాలోనే ఎందుకు తయారు చేశారు?

ప్రపంచంలోని అతిపెద్ద విగ్రహాల్లో 26వది.. దేశంలో రెండొవది.. 216 అడుగుల ఎత్తు.. పీఠంపై 54 కలువ రేకులు..వాటి కింద 36 ఏనుగుల శిల్పాలు.. 18 శంఖాలు.. 18 చక్రాలు.. 108 మెట్లు.. ఇలా ఎన్నో విశిష్టతలు కలిగిన అత్యంత సుందరమైన ప్రదేశం ఇప్పుడు తెలంగాణలో ఉంది.. సమతా మూర్తి (స్టాట్యూ ఆఫ్ ఈక్వీటీ)గా పేర్కొంటున్న రామానుజచార్యలు విగ్రహాన్ని శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. దాదాపు వెయ్యి కోట్ల రూపాయలతో విగ్రహంతో పాటు 45 ఎకరాల్లో ఆశ్రమాన్ని నిర్మించారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్ గ్రామంలో ఉన్న ఈ విగ్రహం ప్రపంచ పర్యాటక ప్రదేశంగా నిలుస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే ఆ విగ్రహం ప్రత్యేకతలేంటో ఇప్పుడు చూద్దాం.

ముచ్చింత్ గ్రామంలోని ఆశ్రమంలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహానికి భద్రపీఠం అని పేరు పెట్టారు. ఈ విగ్రహ నిర్మాణం కోసం చాలా మంది పోటీ పడ్డారు. కానీ చైనాకు దేశంలోని నాన్జింగ్ నగరానికి చెందిన చెంగ్యాంగ్ గ్రూపులో భాగమైన ఏరోజన్ కార్పొరేషన్ అనే కంపెనీ ఈ విగ్రహ నిర్మాణ బాధ్యతలను దక్కించుకుంది. ఈ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా అనేక విగ్రహాలను నిర్మించింది. ఇక సమతా మూర్తి విగ్రమంలో 7 వేల టన్నుల పంచలోహాలను ఉపయోగించారు. బంగారు వెండి, రాగి, కంచు, జింక్ పదార్థాలను ఉపయోగించారు. ఆరోజన్ కార్పొరేష్ కీ, జీయర్ ఇంటిగ్రేటెడ్ వేదిక్ అకాడమి (జీవా) ల మధ్య విగ్రహ నిర్మాణం కోసం 2015 ఆగస్టు 14న ఒప్పందం కుదిరింది. వాస్తవానికి ఈ విగ్రహ నిర్మాణానికి 2014 నుంచి ప్రతిపాదలను ఉండగా 2015లో ఒప్పందం కుదిరింది. 2021లో పూర్తయింది.

విశిష్ఠాద్వైత సిద్ధాంతకర్త రామానుజాచార్యులు జన్మించి 1000 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇందులో భాగంగా సహస్రాబ్దిఉత్సవాలు నిర్వహించారు. ‘అందరి దు:ఖాలు దూరం చేయడానికి నేనొక్కడినే నరకం పాలైనా అంగీకరిస్తాను.. మాధవుని ముందు మనుష్యులందరూ సమానులే’ అని రామానుజాచార్యులు బోధించేవారు. ఈయన క్రీస్తు శకం 1017లో పుట్టి 1137లో సమాధి అయినట్లు చరిత్ర చెబుతోంది. తమిళనాడులోని పెరంబుదూర్లోని ఓ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన రామానుజాచార్యులు కాంచీపురంలో చదువుకున్నారు. అక్కడి వరదరాజ స్వామికి ఎక్కువగా పూజించేవారు.

‘గోష్టీపూర్ణుడనే గురువు చెప్పిన రహస్య అష్టాక్షరీ మంత్రాన్ని ఎవరికీ చెప్పకూడదు అన్న నిబంధన ఉన్నప్పటికీ రామానుజ చార్యులు గుడి గోపురం ఎక్కి గట్టిగా అందరికీ వినిపించేలా చెప్పారని నేటి శ్రీ వైష్ణవులు అంటారు. దీనిని ఎవరికైనా చెబితే విన్నవారు పుణ్యాత్ములు, చెప్పిన వారు పాపాత్ములు అవుతారని నిబంధన ఉంది. అయినా అందరికీ పుణ్యం వచ్చినప్పడు నాకు పాపం వచ్చినా పర్వాలేదని భావించారని వారు పేర్కొంటారు. కులోత్తుంగ అనే చోళుడు శైవ మత భక్తితో వైష్ణవులను హింసించినప్పుడు అక్కడ నుంచి తరలించిన ఉత్సవ మూర్తులతో తిరుపతిలో గోవిందరాజు స్వామి గుడి కట్టించారు. కొన్ని దేవాలయాల్లో దళితులకు ఆలయ ప్రవేశం కోసం రామానుజచార్యులు కృషి చేశారని చెబుతారు.

ఇక రామానుజాచార్యలు సహస్రాబ్ధి ఉత్సవాలను 13 రోజుల పాటు నిర్వహించనున్నారు. ముచ్చింతల్ లో ఈ నెల 2న ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇందులో దేశం నలుమూలల నుంచి 5 వేల మంది రుత్వికులు వచ్చి హోంలో పాల్గొన్నారు. శనివారం ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఇందులో పాల్గొన్నారు. పద్మపీఠంపై పద్మాసనంలో కూర్చున్న భంగిమలో ఉన్న విగ్రహం కింద 120 కిలోల బంగారు రామానుజాచార్యుల విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. త్వరలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఈ క్షేత్రాన్ని సందర్శించనున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version