https://oktelugu.com/

Nootokka Jillala Andagadu Trailer Review : 101 జిల్లాల అందగాడి బట్టతల బాధ ఇదీ

అప్పటి పాత సినిమాల్లో 101 జిల్లాల అందగాడిని అంటూ విలక్షణ నటుడు నూతన్ ప్రసాద్ అలరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు టాలీవుడ్ లో ఆ నూటొక్క జిల్లాల అందగాడిగా మారిపోయాడు నటుడు ‘అవసరాల శ్రీనివాస్’. ఆయన హీరోగా ఓ సినిమా తెరకెక్కింది. తాజాగా విడుదల చేసిన ఈ సినిమా ‘నూటొక్క జిల్లాల అందగాడు’ ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. హిందీలో ప్రయోగాలు చేసే హీరో ఆయుష్మాన్ ఖురానా నటించిన ‘బాల’ చిత్రం కూడా ఈ బట్టతల మీదనే వచ్చి […]

Written By: , Updated On : August 25, 2021 / 01:35 PM IST
Follow us on

అప్పటి పాత సినిమాల్లో 101 జిల్లాల అందగాడిని అంటూ విలక్షణ నటుడు నూతన్ ప్రసాద్ అలరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు టాలీవుడ్ లో ఆ నూటొక్క జిల్లాల అందగాడిగా మారిపోయాడు నటుడు ‘అవసరాల శ్రీనివాస్’. ఆయన హీరోగా ఓ సినిమా తెరకెక్కింది. తాజాగా విడుదల చేసిన ఈ సినిమా ‘నూటొక్క జిల్లాల అందగాడు’ ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది.

హిందీలో ప్రయోగాలు చేసే హీరో ఆయుష్మాన్ ఖురానా నటించిన ‘బాల’ చిత్రం కూడా ఈ బట్టతల మీదనే వచ్చి నవ్వులు పంచింది. ఇప్పుడు తెలుగులో అంతే వినోదాత్మకంగా ‘నూటొక్క జిల్లాల అందగాడు’ మూవీని తీశాడు హీరో అవసరాల శ్రీనివాస్. సరిగ్గా అలాంటి కథాంశమే ఇదీ..

ట్రైలర్ మొత్తం బట్టతలతో అల్లుకున్న కామెడీ, ఎమోషనల్ పైనే సాగింది. చివర్లో కాస్తా భావోద్వేగంతో కథను మలిచారు. జుట్టు రాలిపోవడం.. బట్టతల రావడం ఈరోజుల్లో చాలా కామన్. కొన్ని కోట్ల మంది సమస్య ఇదీ. ఈ మేజర్ సమస్యను తీసుకొని కామెడీని జొప్పించి ఒక మంచి మెసేజ్ ఇచ్చినట్టు గా ఉంది. ఈ తరహా బట్టతల పాత్రలు చేయడం ఒక సాహసమే అని చెప్పాలి. దాన్ని అవసరాల శ్రీనివాస్ ఏమేరకు చేశాడన్నది సినిమాలోనే తెలుస్తుంది.

బట్టతలను కవర్ చేస్తూ విగ్ పెట్టుకొని తిరిగే ఓ యువకుడి కష్టాలు, నష్టాలు, బాధలు అన్నీ ఈ ట్రైలర్ చూపించారు. రుహానీ శర్మ హీరోయిన్ గా నటించిన ఈ మూవీని దిల్ రాజ్, క్రిష్ ఇద్దరూ నిర్మించారు. ఈ సినిమాను సెప్టెంబరు 3న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సినిమాకు హీరో అవసరాల శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, మాటలు అందించడం విశేషం. రాచకొండ విద్యాసాగర్ దర్శకత్వం వహించారు.

Nootokka Jillala Andagadu Trailer | Avasarala Srinivas | Ruhani Sharma|Vidyasagar | Dil Raju | Krish