Harish Shankar shocking comments: వచ్చే నెల 26 వ తేదీన పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) చిత్రం విడుదల అవ్వబోతున్న సందర్భంగా , ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ ని ఒక్కొక్కటిగా వదులుతున్నారు మేకర్స్. డిసెంబర్ నెలలో విడుదల చేసిన ‘దేఖ్లేంగే సాలా’ పాటకు ఫ్యాన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచింది . ముఖ్యంగా పవన్ కళ్యాణ్ డ్యాన్స్ కి ఇతర హీరోల అభిమానులు కూడా ఆశ్చర్యపోయారు. కానీ నిన్న విడుదల చేసిన ‘#AuraOFUstaad’ పాట మాత్రం అభిమానులకు కూడా నచ్చలేదు. ‘ఓజీ’ లో అంతటి క్వాలిటీ మ్యూజిక్ ని విన్న తర్వాత , ఇలాంటి నాసిరకపు లిరిక్స్ తో పాటని ఎవ్వరైనా విడుదల చేస్తారా ?, ఇది పవన్ కళ్యాణ్ రేంజ్ సాంగ్ కాదు అంటూ అభిమానులు తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తూ నిన్న డైరెక్టర్ హరీష్ శంకర్ ని ట్యాగ్ చేసి ఒక రేంజ్ లో తిట్టారు.
అయితే నిన్నటి లిరిక్స్ ని చూసిన తర్వాత చాలా మంది అభిమానుల్లో భయం మొదలైంది. సినిమాలో ఎక్కడ పొలిటికల్ డైలాగ్స్ పెడుతాడో , అవి ఆడియన్స్ కి తీవ్రమైన చిరాకు ని కలిగిస్తాయి , నెమ్మదిగా సినిమా మీద నమ్మకం పోతుంది అంటూ చాలామంది నిన్న కామెంట్స్ చేశారు. దీనిపై డైరెక్టర్ హరీష్ హానికర ఒక వీడియో చేసి సోషల్ మీడియా లో అప్లోడ్ చేసాడు. ఆయన మాట్లాడుతూ ‘చాలా మంది అభిమానులు నాకు మెసేజ్ చేసి ఈ సినిమాలో పొలిటికల్ డైలాగ్స్ ఉంటాయా ?, ఉంటే దయచేసి తీసేయమని అడుగుతున్నారు. ఒకరిద్దరు అడిగి ఉండుంటే సమాధానం చెప్పేవాడిని కాదు, చాలా మంది అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఈ చిత్రంలో ఎలాంటి పొలిటికల్ డైలాగ్స్ లేవు. కళ్యాణ్ గారు మాకు సినిమా మొదలైన మొదటి రోజు నుండే చెప్తూ వచ్చేవాడు. సినిమా సినిమానే , రాజకీయం రాజకీయమే , రెండిటిని కలపకు , మన వల్ల ఒక వ్యక్తి మనోధభావాలు దెబ్బ తినే లాగా డైలాగ్స్ రాశామంటే సినిమా యొక్క ముఖ్య ఉద్దేశ్యం వృధా అవుతుందని చెప్పాడు ‘ అంటూ చెప్పుకొచ్చాడు హరీష్ శంకర్ .
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని హైలైట్ చేసే డైలాగ్స్ అయితే ఈ సినిమాలో ఉంటాయి కానీ , ఇతరుల మనసులు నొచ్చుకునే విధమైన డైలాగ్స్ ఉండవు. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా మాకు కేవలం ఎంటర్టైన్మెంట్ ఇవ్వండి చాలు , పొలిటికల్ రిఫరెన్స్ డైలాగ్స్ వద్దు అని నా వద్ద ప్రాధేయపడ్డారు. అలా అడిగిన ఫ్యాన్స్ కి నా సెల్యూట్. ఈ సినిమాలో మీరు కోరుకునే ఎంటర్టైన్మెంట్ మాత్రమే ఉంటుంది’ అంటూ చెప్పుకొచ్చాడు హరీష్ శంకర్. ఆయన మాట్లాడిన మాటలను ఈ క్రింది వీడియో లో చూడొచ్చు.
https://x.com/i/status/2025893219112984825