https://oktelugu.com/

బాక్సాఫీస్ : ఈ వారం సినిమాలు సిరీస్ లు ఇవే !

థియేటర్లు తెరుచుకున్నాయి.. గత వారం బాక్సాఫీస్‌ వద్ద ‘తిమ్మరుసు’, ‘ఇష్క్‌’ సినిమాలు అదృష్టం పరీక్షించుకున్నాయి. అయితే, ఇష్క్ తేలిపోయింది. అందుకే, థియేటర్స్ లో కలెక్షన్స్ రావడం లేదనే.. కొన్ని సినిమాలు ఇంకా ఓటీటీల వైపే చూస్తున్నాయి. మరి ఈ వారం థియేటర్‌ తో పాటు, ఓటీటీల్లో రిలీజ్ అయ్యే సినిమాల లిస్ట్ ఏమిటో చూద్దాం. ఈ వారం రాబోయే తెలుగు సినిమాల్లో ‘ఎస్‌ఆర్‌ కల్యాణమండపం’ అనే సినిమాకి కాస్త అంచనాలు ఉన్నాయి. కిరణ్‌ అబ్బవరం, ప్రియాంకా జవాల్కర్‌ […]

Written By:
  • admin
  • , Updated On : August 2, 2021 / 12:30 PM IST
    Follow us on

    థియేటర్లు తెరుచుకున్నాయి.. గత వారం బాక్సాఫీస్‌ వద్ద ‘తిమ్మరుసు’, ‘ఇష్క్‌’ సినిమాలు అదృష్టం పరీక్షించుకున్నాయి. అయితే, ఇష్క్ తేలిపోయింది. అందుకే, థియేటర్స్ లో కలెక్షన్స్ రావడం లేదనే.. కొన్ని సినిమాలు ఇంకా ఓటీటీల వైపే చూస్తున్నాయి. మరి ఈ వారం థియేటర్‌ తో పాటు, ఓటీటీల్లో రిలీజ్ అయ్యే సినిమాల లిస్ట్ ఏమిటో చూద్దాం.

    ఈ వారం రాబోయే తెలుగు సినిమాల్లో ‘ఎస్‌ఆర్‌ కల్యాణమండపం’ అనే సినిమాకి కాస్త అంచనాలు ఉన్నాయి. కిరణ్‌ అబ్బవరం, ప్రియాంకా జవాల్కర్‌ హీరోహీరోయిన్లుగా సాయికుమార్‌ కీలక పాత్రలో వస్తోన్న ఈ సినిమాకి శ్రీధర్‌ గాదె దర్శకత్వం వహించాడు. మరి ఈ సినిమాకి థియేటర్లలో ఎంతవరకు కలెక్షన్స్ వస్తాయి అనేది చూడాలి.

    ‘ముగ్గురు మొనగాళ్లు’.. శ్రీనివాస్ రెడ్డి, దీక్షిత్ శెట్టి, వెన్నెల రామారావు ప్రధాన పాత్రల్లో ఈ వారం రిలీజ్ అవుతోన్న మరో సినిమా ఇది. అభిలాష్ రెడ్డి దర్శక‌త్వం వహించాడు. క‌ళ్లు క‌నిపించని, చెవులు వినిపించ‌ని, మాట్లాడ‌లేని ముగ్గురు వ్యక్తుల క‌థ ఇది. స‌ర‌దాగా సాగుతుంది అంటున్నారు, రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ లో మాత్రం మ్యాటర్ లేదు.

    ‘ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు’… ఈ సినిమా పేరే చెబుతుంది, ఈ సినిమా ఎలా ఉండబోతుందో. హస్వంత్‌ వంగ హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. అలాగే మరో సినిమా ‘మెరిసే మెరిసే. ఈ వారమే మెరుపులు మెరిపించాలని వస్తోంది. కానీ, కంటెంట్ లో మెరిసే స్టఫ్ లేదని అర్థమైపోయింది. అలాగే ‘క్షీర సాగర మథనం’. రిలీజ్ అయినా ఈ సినిమా ఎవరికీ తెలియదు లేండి. అది ఈ సినిమా రేంజ్.

    ఇక ఓటీటీలో విడుదలయ్యే సినిమాల విషయానికి వస్తే..

    ‘డయల్‌ 100’.. మనోజ్‌ బాజ్‌పాయ్‌, నీనా గుప్త కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఆగస్టు 6న జీ5 వేదికగా విడుదల కానుంది.

    ఆగస్టు 4, 2021

    షార్ట్‌సర్క్యూట్‌ సీజన్‌-1 (డిస్నీ+ హాట్‌స్టార్‌)
    టర్నర్‌ అండ్‌ హూచ్‌ (డిస్నీ+ హాట్‌స్టార్‌)
    మాన్‌స్టర్స్‌ ఎట్‌ వర్క్‌ (డిస్నీ+ హాట్‌స్టార్‌)

    ఆగస్టు 6, 2021

    ది మిస్టీరియస్‌ బెనిడిక్ట్‌ సొసైటీ((డిస్నీ+ హాట్‌స్టార్‌)
    బ్రేకింగ్‌ బాబీ బోన్స్‌(సీజన్‌-1) (నేషన్‌ జియోగ్రాఫిక్‌)
    స్టార్‌ వార్స్‌: గార్డెన్‌ రామ్‌సే: అన్‌ ఛార్టెడ్‌(డిస్నీ+ హాట్‌స్టార్‌)
    స్టార్‌ వార్స్‌: ది బ్యాడ్‌ బ్యాచ్‌(డిస్నీ+ హాట్‌స్టార్‌)