Site icon OkTelugu

Attitude Star Chandrahas: నేను చేసిన తప్పుకి సినిమా ఫ్లాప్ అవుతుందేమో అని భయంగా ఉంది’ అంటూ వెక్కి వెక్కి ఏడ్చిన చంద్రహాస్!

Attitude Star Chandrahas

Attitude Star Chandrahas

Attitude Star Chandrahas: మన తెలుగు ఆడియన్స్ మంచి సినిమాలను ఆదరించడం లో ఎప్పుడూ ముందు ఉంటారు. వాళ్ళ ఆదరణ దక్కించుకోవాలంటే, మంచి సినిమా తీస్తే చాలు, హీరో ఎవరు అనేది చూడరు, భారీ వసూళ్లను అందించేంత విశాలమైన హృదయం మన ఆడియన్స్ కి ఉంది. కళ ని ఆదరించడం లో ఇండియాలోనే మన మూవీ లవర్స్ మేటి అని చెప్పొచ్చు. అలాంటి మూవీ లవర్స్ ఉన్న ఈ చోట, తమ సినిమాకు అటెన్షన్ దక్కాలని కొంతమంది నటీనటులు చేసే వికృత చర్యలను ఈమధ్య కాలంలో చాలానే చూసి విసిగిపోయారు ఆడియన్స్. రీసెంట్ గా టీవీ సీరియల్ నటుడు ప్రభాకర్ కొడుకు చంద్రహాస్(Attitude Star Chandrahas) హీరో గా ‘బారాబర్ ప్రేమిస్తా’ అనే చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన పాడిన ఒక బూతు పాటకు సోషల్ మీడియా లో ఎలాంటి తీవ్రమైన నెగటివిటీ ఏర్పడిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

ఈ చిత్రం ఫిబ్రవరి 6వ తేదీన విడుదలైంది. ఈ సినిమాకు షేర్ వసూళ్లు కాదు కదా, కనీసం గ్రాస్ వసూళ్ళు కూడా నమోదు అవ్వలేదు. చాలా ప్రాంతాల్లో థియేటర్స్ కి కరెంటు బిల్ ఖర్చులు కూడా రాలేదు. అంత పెద్ద ఫ్లాప్ అయ్యింది. అయితే ఈ సినిమా ప్రీమియర్ షో చూసిన తర్వాత యాటిట్యూడ్ స్టార్ చంద్ర హాస్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఆయన మాట్లాడుతూ ‘అసలు నాకు మాటలు రావడం లేదు. ఈ సినిమాని నేను రెండు మూడు నెలల క్రితం చూసాను, కానీ ఫైనల్ కాపీ ని చూడలేదు. కానీ సినిమా చూసిన తర్వాత చాలా ఏడుపొచ్చింది. సినిమా చాలా బాగా వచ్చింది. ఈమధ్య కాలం లో నాపై జరిగిన నెగటివిటీ కారణంగా ప్రేక్షకులు నా సినిమాకు రారు ఏమో అని భయం వేస్తుంది. ఎదో కొంతమందికి నచ్చుతుందని అలా చేశాను, ఇప్పుడు అది నా సినిమాపై ఎఫెక్ట్ కొడుతుందేమో అని భయం వేస్తోంది. సినిమా బాగాలేకపోతే పర్వాలేదు, కానీ బాగున్నప్పటికీ కూడా ఫ్లాప్ అవుతుందేమో అని భయం వేస్తోంది’ వెక్కి వెక్కి ఏడ్చాడు చంద్ర హాస్.

అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది , దానిని మీరు క్రింద చూడొచ్చు. తెలిసీ తెలియని వయస్సు, ఎదో ప్రయత్నం చేసావు, కానీ అది తప్పు అని ఇప్పటికైనా తెలుసుకున్నావు, ఇక నుండి అలాంటి పనులు చేయకు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. మంచి కంటెంట్ ఉన్న సినిమా అని నీకు అనిపిస్తే సరిపోదు, జనాలకు కూడా అనిపించాలి, అప్పుడే నీ సినిమాకు వాళ్ళు కదులుతారు అంటూ చెప్పుకొస్తున్నారు నెటిజెన్స్.

 

Exit mobile version