Homeఎంటర్టైన్మెంట్Atithi Devobhava: అతిధి...

Atithi Devobhava: అతిధి దేవోభవ’ దారుణాతి దారుణం.. మరీ ఇంత డిజాస్టరా ?

Atithi Devobhava: ఆది సాయి కుమార్ హీరోగా, నువేక్ష హీరోయిన్‌ గా వచ్చిన చిత్రం ‘అతిధి దేవోభవ’. ఈ సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే..చెప్పుకుంటే సిగ్గుచేటు అన్నట్టు ఉంది పరిస్థితి. అసలు ఈ ‘అతిథి దేవో భవ’కి రూ.1.30 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కానీ ఓవరాల్ గా మొత్తం వరల్డ్ వైడ్ గా 0.28 కోట్లును మాత్రమే ఈ చిత్రం రాబట్టింది. పాపం బయ్యర్లు ఫుల్ గా బుక్ అయ్యారు. నిర్మాతలు కూడా ఈ సినిమాతో భారీగానే నష్టపోయారు.

Atithi Devobhava
Atithi Devobhava

పొలిమేర నాగేశ్వర్ అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుంచి విపరీతమైన డిజాస్టర్ టాక్ తో కనీస ఓపెనింగ్స్ కూడా తెచ్చుకోలేకపోయింది. అతి దారుణంగా వచ్చాయి ఓపెనింగ్స్. కొన్ని థియేటర్స్ లో అయితే సింగిల్ టికెట్ కూడా తెగ లేదని టాక్ వచ్చింది. అసలు ఈ మధ్య కాలంలో ఈ రేంజ్ లో ప్లాప్ అయిన సినిమా మరొకటి లేదట.

Also Read:  బంగార్రాజు’ సెన్సార్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే ?

ఆ స్థాయిలో బిగ్గెస్ట్ ప్లాప్ చిత్రంగా ఫుల్ క్రెడిట్ ను కొట్టేసింది ఈ ‘అతిధి దేవోభవ’ చిత్రం. ఆది సాయి కుమార్ ఈ సినిమా పై భారీ హోప్స్ పెట్టుకున్నా.. కనీసం ప్లాప్ టాక్ కూడా రాలేదు. ఈ సినిమాతో తనకు కొంచెం మార్కెట్ అయినా బిల్డ్ అవుతుందని ఆది చాలా ఆశ పడ్డాడు. అయితే, ఈ సినిమాకి మినిమమ్ ఓపెనింగ్స్ కూడా నమోదు కాకపోవడం ఆది బాగా నిరాశ చెందాడు.

ఇక ఈ అతి పెద్ద డిజాస్టర్ కి వచ్చిన ఫస్ట్ వీక్ కలెక్షన్లను చూద్దాం.

ఆంధ్రా : 0.08 కోట్లు
నైజాం 0.12 కోట్లు
సీడెడ్ 0.07 కోట్లు

ఇక ఏపీ మరియు తెలంగాణ మొత్తం కలుపుకుని చూస్తే : 0.27 కోట్లు

రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.01 కోట్లు

ఓవరాల్ గా మొత్తం వరల్డ్ వైడ్ గా 0.28 కోట్లును ఈ చిత్రం రాబట్టింది.

పాపం మిర్యాల రాజాబాబు, అశోక్‌ రెడ్డి ఈ సినిమాని నిర్మించారు. అసలు ఊరు పేరు లేని హీరోకి కూడా మినిమమ్ కలెక్షన్స్ వస్తాయి. అలాంటిది ఆది సాయి కుమార్ కి మాత్రం అస్సలు కలెక్షన్స్ రాకపోవడం నిజంగా విచిత్రమే. ఒక విధంగా ఈ మధ్య కాలంలో ఆది సాయి కుమార్ హీరోగా చేసిన సినిమాల్లోనే ఈ సినిమా అతి పెద్ద డిజాస్టర్ సినిమాగా నిలిచింది. చివరగా ‘అతిధి దేవోభవ’ దారుణాతి దారుణం.

Also Read:  సమంత డైలీ లైఫ్ ఎలా ప్రారంభం అవుతుందో తెలుసా?

Get notified whenever we post something new!

spot_img

Create a website from scratch

Just drag and drop elements in a page to get started with Newspaper Theme.

Continue reading

Nayani Pavani Elimination: ఓటింగ్ అంతా ఫేక్, నయని ఎలిమినేషన్ పై విచారణ జరగాలి… మాజీ కంటెస్టెంట్ డిమాండ్!

మొదటి ఐదు వారాలు ఆడియన్స్ ఓట్లు వేసి నిర్ణయించిన ప్రకారం ఎలిమినేషన్ జరిగింది. ఆరో వారం జరిగిన ఎలిమినేషన్ మాత్రం పూర్తిగా ఆడియన్స్ నిర్ణయానికి వ్యతిరేకంగా జరిగింది. దీంతో సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Ritu Varma: మెగా కోడలు కాబోతున్న మరో హీరోయిన్?

ఇండస్ట్రీ ప్రముఖులకు ఆహ్వానం లేదు. వివాహం అనంతరం హైదరాబాద్ లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారట. ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారట.

Bigg Boss 7 Telugu: ఎపిసోడ్ హైలెట్… భోలే బూతులు, ప్రియాంక, శోభా చురకలు… నామినేషన్స్ లో ఆ 7గురు!

ఏదో ఫ్లోలో వచ్చాయే నాకు ఎలాంటి తప్పుడు ఉద్దేశం లేదన్నాడు. పక్కనే ఉన్న ప్రియాంక కూడా భోలే మీద ఫైర్ అయ్యింది. నువ్వు ఆగు అంటూ... ప్రియాంకతో అన్నాడు.

Enjoy exclusive access to all of our content

Get an online subscription and you can unlock any article you come across.