Athadu Re-Release: ఈ ఏడాది రీ రిలీజ్ సినిమాల క్యాటగిరీలో భారీ అంచనాలను ఏర్పాటు చేసుకున్న చిత్రం ‘అతడు'(Athadu Movie). మహేష్ బాబు(Super Star Mahesh Babu) కెరీర్ లో ఆల్ టైం క్లాసిక్ గా పిలవబడిన ఈ చిత్రం టీవీ టెలికాస్ట్ లో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అత్యధిక సార్లు టీవీ లలో ప్రదర్శింపబడిన చిత్రమిదే. అందరూ అంతలా ఇష్టపడే ఈ చిత్రాన్ని థియేటర్స్ లోకి తీసుకొస్తే కచ్చితంగా హిస్టరీ క్రియేట్ అవ్వుధి అని, మహేష్ బాబు ఈ ఆగష్టు 9న 50వ సంవత్సరం లోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆయనకు ఒక అద్భుతమైన బహుమతిగా ఈ సినిమా ఫలితాన్ని ఇవ్వొచ్చని మహేష్ ఫ్యాన్స్ కలలు కన్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ మొదలై చాలా రోజులైంది. కానీ ఆశించిన స్థాయిలో గ్రాస్ వసూళ్లు మాత్రం రావడం లేదు.
Also Read: చిరంజీవి తో టాలీవుడ్ నిర్మాతల అత్యవసర భేటీ..ఏంటి సంగతి?
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా వచ్చిన గ్రాస్ కేవలం కోటి 25 లక్షల రూపాయిలు మాత్రమే. మహేష్ గత రీ రిలీజ్ చిత్రాలకు కేవలం హైదరాబాద్ సిటీ నుండి వచ్చిన గ్రాస్ ఇది. కోటి 25 లక్షల గ్రాస్ డీసెంట్ రేంజ్ కానీ రికార్డ్స్ క్రియేట్ చేయడానికి ఇది ఏమాత్రం సరిపోదు. ప్రస్తుతం మొదటి రోజు ఆల్ టైం రికార్డు పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ ఖాతాలో ఉంది. ఈ చిత్రానికి మొదటి రోజున దాదాపుగా 8 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈ రికార్డు ని ఖలేజా చిత్రం బద్దలు కొడుతుందని అనుకున్నారు,కానీ కుదర్లేదు. అతడు చిత్రానికి తిరుగుండదు, కచ్చితంగా ఈ సినిమా ‘గబ్బర్ సింగ్’ రికార్డుని కొడుతుందని అనుకున్నారు. కానీ అది కూడా జరిగేలా కనిపించడం లేదు. అసలు అతడు చిత్రానికి ఊహించిన విధంగా అడ్వాన్స్ బుకింగ్స్ ఎందుకు జరగడం లేదో కారణాలను ఒకసారి పరిశీలిద్దాం.
Also Read: ‘కూలీ’ లో పవన్ కళ్యాణ్ రియల్ లైఫ్ సన్నివేశం..? ఇదేమి ట్విస్ట్ బాబోయ్!
వివరాల్లోకి వెళ్తే మహేష్ ఫ్యాన్స్ ఇప్పటికే తమ ఎనర్జీ ని మొత్తం ‘ఖలేజా’ చిత్రానికి కేటాయించారు. ఆ సినిమాకు దాదాపుగా పది కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను ఇచ్చిన తర్వాత, అంతకు మించిన వసూళ్లను రాబట్టడం కాస్త కష్టం తో కూడుకున్న పని. ఆ ప్రభావం ‘అతడు’ చిత్రం మీద పడిందని స్పష్టంగా తెలుస్తుంది. మరో కారణం ఏమిటంటే అతడు చిత్రాన్ని ప్రేక్షకులు వందల సార్లు టీవీ లో చూస్తూనే ఉన్నారు. ప్రతీ వారం స్టార్ మా ఛానల్ లో ఎదో ఒక రోజు వేస్తూనే ఉంటారు. అన్నిసార్లు టీవీ లో ఈ సినిమాని చూసిన జనాలకు మళ్ళీ థియేటర్ కి వెళ్లి చూడాలంటే కష్టమే కదా. ఇక చివరి కారణం ఏమిటంటే ఈ సినిమా వచ్చిన వారం రోజులకు థియేటర్స్ లో ‘కూలీ’, ‘వార్ 2’ లాంటి చిత్రాలు రాబోతున్నాయి. ప్రేక్షకులు డబ్బులు ఆ చిత్రాల కోసం దాచుకోవడం వల్ల, అతడు ని పట్టించుకోలేదు అని అంటున్నారు నెటిజెన్స్.