Chiranjeevi Emergency Meeting: టాలీవుడ్ లో ఏ చిన్న సమస్య వచ్చినా దర్శక నిర్మాతలు వాటి పరిష్కారం కోసం మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ఇంటి గడపని తొక్కుతుంటారు. పేరుకి మూవీ ఆర్టిస్ట్ అస్సోసియేషన్ అనే సంఘం ఒకటి ఉంది కానీ, సమస్యలు వచ్చినప్పుడు ఆ సంఘం ఎక్కడ దాగి ఉంటుందో ఎవరికీ అర్థం అవ్వదు. గత కొద్దిరోజులుగా సినీ నిర్మాతలకు , సినిమా కార్మికులు/జూనియర్ ఆర్టిస్టుల మధ్య ఒక యుద్ధం జరుగుతుంది. తమకు జీతాలు 30 శాతం కి పైగా పెంచాలని నిర్మాతలను డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళ వైపు నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో నిన్నటి నుండి బంద్ కి పిలుపునిచ్చారు. దీంతో జూనియర్ ఆర్టిస్టుల కొరత కారణంగా షూటింగ్స్ మొత్తం ఆగిపోయాయి. కానీ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) మూవీ టీం వీళ్ళ పై ఆధారపడకుండా తమిళనాడు నుండి, ముంబై నుండి ఆర్టిస్టులను పిలిపించి నిన్న షూటింగ్ జరిపించారు.
Also Read: తమ్ముడు ఫేమ్ ‘అచ్యుత్’ గుర్తున్నాడా..? ఇతని అన్నయ్య ఇండస్ట్రీ లో స్టార్ హీరో..గుర్తుపట్టగలరా?
ఈ విషయం తెలుసుకొని అస్సోసియేషన్ వారు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెట్స్ వద్దకు వచ్చి రచ్చ చేసే ప్రయత్నం చేశారు. కానీ మేకర్స్ పోలీసులను పిలిపించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటన నిన్న పెద్ద హాట్ టాపిక్ గా మారింది. అయితే బంద్ కారణంగా రోజురోజుకి నిర్మాతలకు నష్టం భారీగా చేకూరుతుంది. ఈ సమస్య కి పరిష్కారం కోసం నేడు సాయంత్రం టాలీవుడ్ నిర్మాతలందరూ మెగాస్టార్ చిరంజీవి ని కలవడానికి వెళ్తున్నారు. చిరంజీవి జ్యోక్యం కారణంగా సినీ కార్మికులు/జూనియర్ ఆర్టిస్టులు తగ్గి బంద్ కి విరమణ ఇస్తారో లేదో చూడాలి. నిజానికి చెప్పాలంటే తెలుగు సినీ పరిశ్రమ ప్రస్తుతం గడ్డు కాలాన్ని ఎదురుకుంటుంది. సంక్రాంతి తర్వాత విడుదలైన సినిమాల్లో కనీసం ఒక్క నిఖార్సైన హిట్ కూడా పడలేదు. రీసెంట్ గా విడుదలైన ‘హరి హర వీరమల్లు’, ‘కింగ్డమ్’ చిత్రాలు కూడా భారీగా నిరాశపరిచాయి.
Also Read: ‘కూలీ’ లో నాగార్జున క్యారక్టర్ ని మిస్ చేసుకున్న సూపర్ స్టార్ అతనేనా..?
దీంతో డబ్బులు రొటేషన్ జరగక, సినీ పరిశ్రమ మొత్తం కుదేలు అయిపోయింది. ఇలాంటి సమయం లో సినీ కార్మికులు/ జూనియర్ ఆర్టిస్టులు ఇలా నిర్మాతలపై ఒత్తిడి పెంచడం ఏ మాత్రం కరెక్ట్ కాదని పలువురి అభిప్రాయం. సినిమాకు నిర్మాత దేవుడు లాంటివాడు. ఆయన బాగున్నప్పుడే ప్రతీ ఒక్కరికి అన్నం పెట్టగలడు. అలాంటిది నిర్మాతనే కష్టాల్లో ఉన్నప్పుడు వారిపై మరింత భారం పెట్టాలని అనుకోవడం ఎంత వరకు కరెక్ట్ చెప్పండి. ఎన్నో ఏళ్ళ నుండి సినీ కార్మికులు ఒకే జీతం మీద బ్రతుకుతున్నారు, వాళ్ళ పోరాటం లో కూడా న్యాయం ఉంది. కానీ సినిమాలు సరిగా ఆడని ఈ సమయం లో డిమాండ్ చేయడం కరెక్ట్ కాదు కదా అని నెటిజెన్స్ అభిప్రాయం. మరి ఈ వ్యవహారం చిరంజీవి జ్యోక్యం తో ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో చూడాలి.