https://oktelugu.com/

Shriya Saran : శ్రియా పరువాలపై నుండి జారిపోయేలా ఉన్న డ్రెస్… ముంచేస్తున్న ఆర్ ఆర్ ఆర్ బ్యూటీ గ్లామర్ సునామీ 

2018లో శ్రియ రష్యన్ ప్రియుడు ఆండ్రీని వివాహం చేసుకున్నారు. వీరికి ఒక పాప. అటు ప్రొఫెషనల్ లైఫ్ ఇటు పర్సనల్ లైఫ్ బ్యాలన్స్ చేస్తూ హ్యాపీగా లాగించేస్తుంది. 

Written By:
  • Shiva
  • , Updated On : July 1, 2023 / 08:44 AM IST
    Follow us on

    Shriya Saran : నలబై ఏళ్ల వయసులో ఇరవై ఏళ్ల భామలకు పోటీ ఇస్తుంది శ్రియ శరన్. ఆమె విషయంలో వయసు జస్ట్ నెంబర్ మాత్రమే అనిపిస్తుంది. వయసు పెరుగుతున్నా అందం ఇసుమంత కూడా తగ్గడం లేదు. అదే నాజూకు శరీరం, మెరిసే మేని ఛాయ మైంటైన్ చేస్తుంది. శ్రియకు పెళ్లయ్యిందంటే నమ్మడం కష్టమే. తాజాగా రెడ్ కలర్ బాడీ కాన్ డ్రెస్ లో సూపర్ గ్లామరస్ గా దర్శనమిచ్చింది. చాలీ చాలని ఆ డ్రెస్ జారిపోయేలా ఉందని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

    శ్రియ నట ప్రస్థానం మొదలైన 20 ఏళ్ళు దాటిపోయింది. 2001లో ఇష్టం మూవీతో పరిశ్రమలో అడుగుపెట్టింది. వెంటనే నాగార్జున వంటి టాప్ స్టార్ ఛాన్స్ ఇచ్చాడు. నాగార్జున-శ్రియ కాంబోలో తెరకెక్కిన సంతోషం సూపర్ హిట్. అనంతరం బాలయ్యకు జంటగా చెన్నకేశవరెడ్డి చిత్రం చేసింది. వివి వినాయక్ తెరకెక్కించిన ఈ ఫ్యాక్షన్ డ్రామా సైతం హిట్ కొట్టింది. దాంతో శ్రియ వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం రాలేదు. అంతకంతకూ తన ఇమేజ్ పెంచుకుంటూ పోయింది. 
     
    శ్రియ రెండు తరాల స్టార్స్ తో నటించిన అరుదైన హీరోయిన్స్ లో ఒకరు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లతో జతకట్టిన ఈ భామ… ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, మహేష్, ప్రభాస్ లతో ఆడిపాడింది. శ్రియ మంచి నటి, అంతకు మించిన డాన్సర్. ఈ అంశాలతో పాటు అదృష్టం కూడా కలిసొచ్చింది. ఇప్పటికీ శ్రియ కెరీర్ నెమ్మదించలేదు. అడపాదడపా చిత్రాలు చేస్తూనే ఉంది. 
     
    ఆర్ ఆర్ ఆర్ మూవీలో అజయ్ దేవ్ గణ్ భార్య పాత్ర చేశారు. గతంలో రాజమౌళి డైరెక్షన్ లో శ్రియ ఛత్రపతి చిత్రం చేసింది. ఇటీవల ఆమె నటించిన మ్యూజిక్ స్కూల్ విడుదలైంది. ఉపేంద్ర హీరోగా విడుదలైన పాన్ ఇండియా మూవీ కబ్జ లో మెయిన్ హీరోయిన్ గా చేసింది. పలు ప్రాజెక్ట్స్ ఆమె చేతిలో ఉన్నాయి. 2018లో శ్రియ రష్యన్ ప్రియుడు ఆండ్రీని వివాహం చేసుకున్నారు. వీరికి ఒక పాప. అటు ప్రొఫెషనల్ లైఫ్ ఇటు పర్సనల్ లైఫ్ బ్యాలన్స్ చేస్తూ హ్యాపీగా లాగించేస్తుంది.