https://oktelugu.com/

Payal Rajput : అనుభవం లేకపోవడంతో ఆ దర్శకులు నన్ను వాడుకున్నారు… పాయల్ రాజ్ పుత్ సంచలన కామెంట్స్ 

పాయల్ తనకు బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు అజయ్ భూపతితో మరోసారి పని చేస్తున్నారు. మంగళవారం టైటిల్ తో ఓ మూవీ తెరకెక్కుతుంది. ఈ చిత్ర పోస్టర్స్ లో పాయల్ టాప్ లెస్ ఫోజుల్లో బోల్డ్ గా ఉన్నారు. మరి మంగళవారం పాయల్ కి బ్రేక్ ఇస్తుందేమో చూడాలి.  

Written By:
  • Shiva
  • , Updated On : July 1, 2023 / 08:37 AM IST
    Follow us on

    Payal Rajput : టాలీవుడ్ లో పాయల్ రాజ్ పుత్ కి గ్రేట్ స్టార్ట్ లభించింది. ఆర్ ఎక్స్ 100 మూవీతో పాయల్ ఓవర్ నైట్ పాప్యులర్ అయ్యారు. పాయల్ గ్లామర్ కి యూత్ పిచ్చెక్కిపోయారు. ఆర్ఎక్స్ 100 లో ఆమె బోల్డ్ రోల్ చేశారు. శృంగార సన్నివేశాల్లో హద్దులు దాటి నటించారు. కార్తికేయ హీరోగా నటించిన ఆ చిత్రానికి అజయ్ భూపతి దర్శకుడు. ఆర్ఎక్స్ 100 సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఆ సినిమాతో వచ్చిన ఫేమ్ కి పాయల్ రాజ్ పుత్ పరిశ్రమను ఏలేయడం ఖాయమని అందరూ భావించారు. అయితే అలా జరగలేదు. పాయల్ వరుస పరాజయాలతో ఉనికి కోల్పోయే ప్రమాదంలో పడింది. 

     
    ఆమె లేటెస్ట్ మూవీ మాయ పేటిక. ఈ చిత్రం జూన్ 30న విడుదలైంది. మాయా పేటిక ప్రమోషనల్ ఈవెంట్లో ఆమె కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు. నేను ప్రతి సినిమాకు 200 % ఎఫర్ట్స్ పెడతాను. శక్తివంచన లేకుండా నటిస్తాను. ఫలితం అనేది మన చేతుల్లో లేదు. దానికి అదృష్టం కూడా కావాలి. ఆర్ఎక్స్ 100 హిట్ తర్వాత కొందరు దర్శకులు నన్ను వాడుకున్నారు. తప్పు దోవపట్టించారు. అప్పుడే పరిశ్రమకు రావడం వలన నాకు ఏమీ తెలియదు. 
     
    నాకు అనుభవం లేకపోవడంతో దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకున్నారని, పాయల్ అన్నారు. చిత్రాల ఎంపికలో తప్పుడు నిర్ణయాలు తీసుకునేలా ప్రేరేపించారని ఆమె పరోక్షంగా చెప్పారు. పాయల్ వెంకీ మామ, డిస్కో రాజా వంటి పెద్ద చిత్రాల్లో నటించారు. ఈ రెండు చిత్రాల్లో ఆమె సెకండ్ హీరోయిన్ రోల్ చేసింది. వెంకీ మామ యావరేజ్ కాగా, డిస్కో రాజా ప్లాప్ టాక్ తెచ్చుకుంది. 
     
    తాజాగా విడుదలైన మాయా పేటిక మొబైల్ దుష్ప్రభావాల ఆధారంగా తెరకెక్కింది. సునీల్ మరో కీలక రోల్ చేశారు. కాగా పాయల్ తనకు బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు అజయ్ భూపతితో మరోసారి పని చేస్తున్నారు. మంగళవారం టైటిల్ తో ఓ మూవీ తెరకెక్కుతుంది. ఈ చిత్ర పోస్టర్స్ లో పాయల్ టాప్ లెస్ ఫోజుల్లో బోల్డ్ గా ఉన్నారు. మరి మంగళవారం పాయల్ కి బ్రేక్ ఇస్తుందేమో చూడాలి.