Allu Arjun : పుష్ప 2 సినిమా విషయంలో అల్లు అర్జున్ మొదటి నుంచి కూడా చాలా కేర్ తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. అయితే ఈ సినిమా భారీ విజయం సాధించడంలో ఆయన కీలకపాత్ర వహించాడు. అయితే పుష్ప 2 సినిమా రిలీజ్ రోజున జరిగిన ఘటన అతన్ని ఇప్పటికీ ఇబ్బంది పెడుతుందట.. ఇక తను ఆ విషయంలో చాలా మనస్థాపానికి గురవుతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా తన సినిమా చూడడానికి వచ్చిన ఒక అభిమాని అలా చనిపోవడం అనేది అల్లు అర్జున్ మీద తీవ్రమైన ఇంపాక్ట్ చూపించే విషయమనే చెప్పాలి. మరి ఇలాంటి సందర్భంలో అల్లు అర్జున్ మీద చాలా మంది చాలా నెగిటివ్ కామెంట్స్ అయితే చేస్తున్నారు. రీసెంట్ గా తమ్మారెడ్డి భరద్వాజ లాంటి ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ కూడా అల్లు అర్జున్ ని ఉద్దేశించి కొన్ని వాక్యలైతే చేశాడు. మరి ఆయన కూడా అల్లు అర్జున్ మీద నెగిటివ్ గా స్పందించడానికి కారణం ఏంటి అంటే ప్రస్తుతం ఇండస్ట్రీలో కొన్ని విపత్కర పరిస్థితిలు ఎదురవుతున్నాయని అది అల్లు అర్జున్ వల్లే అలా జరుగుతున్నాయని అతన్ని పాయింట్ అవుట్ చేసి మాట్లాడినట్టుగా తెలుస్తోంది. నిజానికి అల్లు అర్జున్ కి తమ్మారెడ్డి భరద్వాజ కి మధ్య పెద్దగా మంచి సంబంధాలు అయితే లేవు అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి.
ఇంతకుముందు ఆయన డైరెక్టర్ గా ఒక సినిమాని అల్లు అర్జున్ తో ప్లాన్ చేశాడట కానీ ఆ సినిమా అనుకోని పరిస్థితుల వల్ల సెట్స్ మీదకి వెళ్లలేదు అప్పట్నుంచి ఆయనకి అల్లు అర్జున్ మీద కొంతవరకు నెగిటివ్ ఇంపాక్ట్ ఉందని దానివల్ల అవకాశం దొరికినప్పుడు అతని గురించి బ్యాడ్ గా మాట్లాడే ప్రయత్నం చేస్తాడు అంటూ కొంతమంది విమర్శకులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు. మరి ఇప్పుడు ఈ వార్తలు కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
అయితే అప్పట్లో తమ్మారెడ్డి భరద్వాజ గారు కూడా చాలా మంచి దర్శకుడిగా గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆయన మంచి సినిమాలు చేసి సూపర్ హిట్స్ ను అందుకున్నాడు. ఇక అల్లు అర్జున్ కెరియర్ మొదట్లో ఆయనతో సినిమా చేయాలనే ప్రయత్నం చేసిన కూడా మధ్యలో కొన్ని పరిస్థితుల వల్ల అది ఆగిపోయింది.
ఇక అల్లు అర్జున్ స్టార్ హీరోగా ఎదగడం అతడితో సినిమా చేసే అవకాశం రాకపోవడంతో ఆయన తన మనసులో ఏదో పెట్టుకున్నాడు అంటూ కొంతమంది అల్లు అర్జున్ అభిమానులు సైతం కొన్ని కామెంట్లైతే చేస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా ఇండస్ట్రీ బాగుంటేనే అందరూ బాగుంటారనేది మాత్రం వాస్తవం. ఇక ఆ ధోరణిలోనే ఇటు అల్లు అర్జున్ గానీ, అటు తమ్మారెడ్డి భరద్వాజ గారైనా ఇంకెవరైనా కూడా అందరూ ఇండస్ట్రీ బాగుండాలని కోరుకుంటు ఇండస్ట్రీ బాగుండే విధంగానే వాళ్ళు సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళితే మంచిదని అందరూ కోరుకుంటున్నారు…