Samantha
Samantha : ఇండియా లోనే బిగ్గెస్ట్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరిగా సమంత కి ఇప్పుడు ఎంత మంచి క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈమె ఒక సినిమా ఒప్పుకుంటే చాలు, కచ్చితంగా ఆ సినిమాలో విషయం ఉంటుంది అని జనాలు బలంగా నమ్ముతున్నారు. ఆ రేంజ్ బ్రాండ్ ఇమేజ్ ని ఏర్పాటు చేసుకుంది. ముఖ్యంగా సమంత నాగ చైతన్య ని పెళ్లి చేసుకున్న దగ్గర నుండి ఆమె సినిమాల ఎంపిక విధానం పూర్తిగా మారిపోయింది. రెగ్యులర్ హీరోయిన్ రోల్స్ కి పూర్తిగా దూరమైంది. కేవలం నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రలను మాత్రమే చేయడం మొదలు పెట్టింది. అలా చేసినప్పటి నుండే ఆమెకు పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు లభించింది. ఇదంతా పక్కన పెడితే నాగ చైతన్య ఈమెతో విడాకులు తీసుకున్న తర్వాత ప్రముఖ యంగ్ హీరోయిన్ శోభిత దూళిపాళ్ల ని పెళ్లాడిన సంగతి తెలిసిందే.
కానీ సమంత మాత్రం ఇప్పటికీ సింగిల్ గానే కొనసాగుతుంది. ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే, ఏ హీరోయిన్ అయినా సింగిల్ గా ఉన్నప్పుడు పలనా హీరోతో డేటింగ్ చేస్తుందని, పలనా హీరోని పెళ్లాడబోతుందని ప్రచారాలు జరుగుతూ ఉంటాయి. కానీ సమంత విషయంలో అలాంటిది ఇప్పటి వరకు చోటు చేసుకోలేదు. కానీ అకస్మాత్తుగా ఇప్పుడు సోషల్ మీడియా లో ఈమె గర్భం దాల్చిన ఫోటోలు వైరల్ అవ్వడంతో అందరూ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. పెళ్లి కాకుండా సమంత కి గర్భం ఎలా వచ్చింది?, అసలు ఇది సినిమాకి సంబంధించిన ఫొటోలా?, లేకపోతే నిజంగానే గర్భం దాల్చిందా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కానీ అవేమి నిజం కాదు, ఇది ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ద్వారా పలువురు నెటిజెన్స్ ని క్రియేట్ చేసిన ఫోటోలు. ఈమధ్య కాలం లో ఈ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ సెలెబ్రెటీలకు పెద్ద తల నొప్పిగా మారింది.
ఈ టెక్నాలజీ వల్ల ఎన్నో పనులు సులువు అయ్యాయి, భవిష్యత్తులో ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ మీద సినిమాలు కూడా రాబోతున్నాయి. ఎన్నో ఉపయోగాలు కళ్ళ ముందే కనిపిస్తున్నాయి. కానీ అంతకు మించి నష్టాలు కూడా ఉన్నాయి. ప్రతీ ఒక్కరు ఈ టెక్నాలజీ ని దుర్వినియోగం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. సమంత పాపులర్ సెలబ్రిటీ కాబట్టి ఆమె ఇలాంటి ఫేక్ AI ఫోటోలను పట్టించుకోక పోవచ్చు. అదే ఒక మధ్య తరగతి అమ్మాయికి సంబంధించిన ఫోటోలకు ఇలాంటి టెక్నాలజీ ని ఉపయోగించి ఇష్టమొచ్చిన్నట్టు వాడితే ఎలా ఉంటుంది..?, అమ్మాయిలు స్వేచ్ఛగా సోషల్ మీడియా లో తమ ఫోటోలను అప్లోడ్ చేయగలరా ఇక?..మధ్య తరగతి కుటుంబాలకు సంబంధించిన అమ్మాయిలు మాత్రమే కాదు, హీరోయిన్స్ కూడా చాలా ఇబ్బందులకు గురి అవుతున్నాయి. కొంతకాలం క్రితమే రష్మిక మందన కి సంబంధించి ఇలాంటి ఫేక్ వీడియో ఒకటి సోషల్ మీడియా లో చక్కర్లు కొట్టింది. దీనికి ఆమె చాలా ఫీల్ అయ్యింది. భవిష్యత్తులో ఇంకెంత మంది దీనికి బలి అవుతారో. కచ్చితంగా ఈ టెక్నాలజీ కి పరిమితులు పెట్టాలి. లేకపోతే భవిష్యత్తులో ఘోరాలు చూడగలం.