కరోనా నివారణకు విరాళం ప్రకటించిన అశ్వినీ దత్

కరోనా వైరస్ చేస్తున్న విలయ తాండవానికి తెలుగు చలన చిత్ర పరిశ్రమ కూడా బాగానే స్పందిస్తోంది. పలువురు నిర్మాతలు , దర్శకులు , హీరోలు తమ వంతుగా ఎంతో కొంత ఆర్ధిక సాయం చేస్తున్నారు. ఆ క్రమంలో కోవిడ్-19 నివారణ కోసం ప్రముఖ నిర్మాత, వైజయంతీ మూవీస్ అధినేత సి. అశ్వినీదత్ రూ. 20 లక్షలు విరాళంగా ప్రకటించారు. ఈ విరాళాన్ని రెండు భాగాలుగా విభజించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 10 లక్షలు, తెలంగాణ […]

Written By: admin, Updated On : July 27, 2021 1:11 pm
Follow us on

కరోనా వైరస్ చేస్తున్న విలయ తాండవానికి తెలుగు చలన చిత్ర పరిశ్రమ కూడా బాగానే స్పందిస్తోంది. పలువురు నిర్మాతలు , దర్శకులు , హీరోలు తమ వంతుగా ఎంతో కొంత ఆర్ధిక సాయం చేస్తున్నారు.

ఆ క్రమంలో కోవిడ్-19 నివారణ కోసం ప్రముఖ నిర్మాత, వైజయంతీ మూవీస్ అధినేత సి. అశ్వినీదత్ రూ. 20 లక్షలు విరాళంగా ప్రకటించారు.

ఈ విరాళాన్ని రెండు భాగాలుగా విభజించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 10 లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 10 లక్షలు అందజేస్తున్నట్లు తెలిసింది. కరోనా వ్యాప్తి నిరోధం విషయంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు బాగా కృషి చేస్తున్నాయని ప్రశంసించిన అశ్వినీదత్.. ప్రభుత్వాల సలహాలు, సూచనలు ప్రజలందరూ తూ.చ. తప్పకుండా పాటించాలని ప్రజలను కోరారు. పోలీసులు, వైద్య సిబ్బంది అలుపనేది లేకుండా ప్రజలకు సేవ చేస్తున్నారని , వాళ్ల శ్రమ వృథా కాకుండా ఉండాలంటే.. ఈ విపత్కర పరిస్థితిని సమష్టిగా ఎదుర్కోవాలనీ, ఆ క్రమంలో అందరూ ఇళ్లల్లోనే ఉండాలనీ ఆశించారు.

ఈ వైరస్ కారణంగా షూటింగ్ జరుపుకోవాల్సిన పలు సినిమాలు తమ షూటింగ్ షెడ్యూల్స్ వాయిదా వేసుకున్నాయి. కాగా సామాజిక దూరంను దృష్టిలో పెట్టుకుని షూటింగ్ లను మరో నెల పోస్ట్ ఫోన్ చేయాల్సిందిగా గవర్నమెంట్ కోరుతోంది.