Akshay Kumar NTR Movie: తెలుగు స్టార్ డైరెక్టర్స్ లో రాజమౌళి తరువాత ఆ స్థాయి ఉన్న డైరెక్టర్ లిస్ట్ లో మొదటి ప్లేస్ ‘కొరటాల శివ’దే. మహేష్, ఎన్టీఆర్, చరణ్ సైతం కొరటాల శివ పై ప్రత్యేక అభిమానాన్ని చూపిస్తున్నారంటే అది కొరటాల డైరెక్షన్ స్కిల్ కి దక్కిన గౌరవం. మరి అలాంటి డైరెక్టర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా స్టార్ట్ చేయబోతున్నాడు అంటూ గత కొన్ని నెలలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఎట్టకేలకు ఆ వార్తలకు మోక్షం కలిగింది.

కొరటాల శివతో ఇప్పటికే ఎన్టీఆర్ తర్వాత సినిమాని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు మేకర్స్. అయితే, తాజాగా ఈ సినిమా గురించి వచ్చిన అప్ డేట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చింది. కొరటాల ఎన్టీఆర్ తో ఓ భారీ యాక్షన్ డ్రామాను తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ చిత్రం పీరియాడిక్ మూవీ అని, పాకిస్తాన్ – ఇండియా విడిపోయిన కాలంలో జరిగిన కొన్ని పరిస్థితుల ఆధారంగా కథ మొదలవుతుందని తెలుస్తోంది.
Also Read: త్రివిక్రమ్ కి యాక్షన్ సెట్ కాదు అంటున్న మహేష్
అలాగే ఆ తర్వాత పాకిస్తాన్ – ఇండియా మధ్య జరిగిన యుద్ధం వరకూ.. ఆ యుద్ధంలో ఇండియా గెలుపు కోసం ఎంత గొప్పగా పోరాటం చేశారనే కోణంలో కొరటాల ఈ సినిమాని తీయాలనుకుంటున్నాడు. ఇక ఈ సినిమాని పాన్ – ఇండియా స్థాయిలో దాదాపు 250 కోట్ల బడ్జెట్ తో నిర్మించనున్నారు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ దాదాపు బల్క్ డేట్స్ కేటాయిస్తున్నాడు.

వచ్చే నెల నుంచి సెట్స్ పైకి ఈ సినిమా వెళ్లనుంది. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబట్టి… గొప్ప యాక్షన్ డ్రామాగా ఈ సినిమా నిలుస్తోందని మేకర్స్ చాలా బలంగా నమ్ముతున్నారు. దాంతో ఈ సినిమాకు పాన్ ఇండియా లెవల్లో మంచి డిమాండ్ ఏర్పడింది. ఇక ఈ సినిమాలో మరో సీనియర్ హీరో పాత్ర ఉంది. ఆ పాత్రలో ఒకప్పటి స్టార్ హీరోని తీసుకోవాలని కొరటాల ప్లాన్ చేస్తున్నాడు.
ఎందుకంటే ఎన్టీఆర్ కి సినిమాలో అది బాబాయ్ పాత్ర అట. వెరీ ఎమోషనల్ గా ఉండే ఆ పాత్రలో స్టార్ హీరో అక్షయ్ కుమార్ ను ఒప్పించాలని ప్లాన్ చేస్తున్నారు. అలాగే ఈ సినిమాలో ఎన్టీఆర్ కి విలన్ గా కూడా తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతిని ఒప్పించాలని ప్లాన్ చేస్తున్నారు.
Also Read: అఖిల్, స్రవంతిలు ముమైత్ ఖాన్ గురించి ఏం మాట్లాడారో తెలుసా?
[…] RRR vs KGF 2: ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఆ స్థాయిలో నేషనల్ రేంజ్ లో ఏదైనా చిత్రం బాగా ట్రెండైందీ అంటే అది ‘కేజీఎఫ్ 2’ సినిమా మాత్రమే. ప్రస్తుతం అన్ని పాన్ ఇండియా సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతూ ఉంటే.. ఫుల్ క్రేజ్ ఉన్న కేజీఎఫ్-2 మాత్రం చాలా కూల్ గా బాక్సాఫీస్ ను షేక్ చేయడానికి రెడీ అవుతుంది. మదర్ సెంటిమెంట్ ప్లస్ యాక్షన్ సన్నివేశాలతో బాగా మెప్పించిందీ చిత్రం ఫస్ట్ పార్ట్. […]
[…] Virata Parvam Movie Release Date: హీరో రానా – క్రేజీ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటించిన “విరాటపర్వం” పరిస్థితి ఏమిటి ? ఈ సినిమా ఎప్పుడో గతేడాదే రిలీజ్ కావాలి. కానీ ఇప్పటి వరకూ రిలీజ్ పై స్పష్టత కూడా లేదు. మరి, “విరాట పర్వం” టీమ్ ఏమి చేస్తోంది ? మరోపక్క ఈ సినిమాని ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ కి అమ్మేశారని వార్తలు వస్తున్నాయి. అయితే, తాజాగా ఈ సినిమా రిలీజ్ గురించి క్లారిటీ ఇచ్చారు రానా. […]
[…] Saregamapa Singer Parvathy: సింగర్ పార్వతి.. గత కొన్ని రోజులుగా ఆమె పేరు సోషల్ మీడియాలో మారుమోగుతోంది. ఇటీవల ఓ టీవీ షోలో ఆమె పాడిన పాట సంగీత ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ షో ప్రసారమై వైరల్ అయ్యింది. ఈ షోకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. పార్వతి తన పాటలతో ఫుల్ ఫేమస్ అయ్యింది. ఇప్పటికే ఆమెకు కోట్లాది మంది అభిమానులయ్యారు. పార్వతి ఎవరు..? ఆమె ఎక్కడి నుంచి వచ్చారు..? అని ప్రేక్షకులు విపరీతంగా ఆరాతీస్తున్నారు. […]