KGF- Ram Charan: ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో రికార్డ్స్ పరంగా KGF సిరీస్ ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో మన అందిరికీ తెలుసు..పార్ట్ 2 గత ఏడాది లో విడుదలై ఏకంగా #RRR మూవీ కలెక్షన్స్ నే దాటేసింది..ఇది అప్పట్లో పెద్ద హాట్ టాపిక్ అయ్యింది..ముఖ్యంగా నార్త్ ఇండియా లో ఈ సినిమాకి సుమారుగా 450 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి..ఈ చిత్రానికి ఫుల్ రన్ లో 1200 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వస్తే.

అందులో 600 కోట్ల రూపాయిలు కేవలం నార్త్ ఇండియా నుండి వచ్చింది..మన టాలీవుడ్ నుండి 230 కోట్ల రూపాయిల గ్రాస్ రాగా..కన్నడ లో 180 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి..తమిళ నాడు మరియు కేరళ వసూళ్లు కూడా కలిపితే ఈ సినిమాకి 1200 కోట్ల రూపాయిలు వసూళ్లు వచ్చాయి అన్నమాట..అంతటి ప్రభంజనం సృష్టించిన ఈ సినిమాకి పార్ట్ 3 కూడా ఉంటుందని ఆ చిత్ర దర్శక నిర్మాతలు ఎప్పటి నుండో చెప్తున్నారు.
రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో కూడా ఆ చిత్ర నిర్మాత విజయ్ కిరగందూర్ KGF చాప్టర్ 3 పై ఒక క్లారిటీ ఇచ్చారు..’ప్రస్తుతం ప్రభాస్ , ఎన్టీఆర్ లతో సినిమాలు చేస్తున్నాము..ఈ రెండు సినిమాలు పూర్తి అవ్వగానే KGF చాప్టర్ 3 ప్రారంభిస్తాం..అంటే 2025 వ సంవత్సరం లో ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లే అవకాశం ఉంది’ అని చెప్పుకొచ్చారు..అంతే కాకుండా KGF చాప్టర్ 3 లో హీరో గురించి కూడా ఒక షాకింగ్ అప్డేట్ ఇచ్చాడు విజయ్ కిరగందూర్..ఆయన మాట్లాడుతూ ‘జేమ్స్ బాండ్ సిరీస్ లో హీరోలు ఎలా అయితే మారుతూ ఉంటారో..KGF సిరీస్ లో కూడా హీరోలు అలాగే మారుతూ ఉంటారు’ అని ఒక హింట్ ఇచ్చాడు.

అంటే చాప్టర్ 3 లో హీరో యాష్ కాదన్నమాట..కొద్దీ రోజుల క్రితమే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని కలిసి ఒక స్టోరీ వినిపించాడు ప్రశాంత్ నీల్..ఆ సినిమా KGF చాప్టర్ 3 అని తెలుస్తుంది..అంటే పార్ట్ 3 లో హీరో గా రామ్ చరణ్ దాదాపుగా ఫిక్స్ అయ్యిపోయినట్టే అని అంటున్నారు..ఇదే కనుక అధికారికంగా ప్రకటిస్తే రామ్ చరణ్ ఫ్యాన్స్ సంబరాలకు హద్దే ఉండదు.