Yash direct Telugu movie: పాన్ ఇండియా లెవెల్ లో మంచి క్రేజ్, మార్కెట్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో ఒకరు రాకింగ్ స్టార్ యాష్(Rocking star yash). కన్నడలో ఈయన బిగ్గెస్ట్ సూపర్ స్టార్. KGF చిత్రం తో ఆయన ఒక్కసారిగా పాన్ ఇండియన్ సూపర్ స్టార్ గా మారిపోయాడు. ఇప్పుడు ఆయన హీరో గా నటించిన ‘టాక్సిక్’ చిత్రం కోసం ప్రపంచంలో ఉన్న మూవీ లవర్స్ అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. రీసెంట్ గానే ఈ చిత్రం నుండి విడుదలైన టీజర్ కి పాన్ ఇండియా లెవెల్ లో సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. యూట్యూబ్ లో సుమారుగా ఈ టీజర్ కి 100 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయి. తెలుగు లో కూడా ఈ చిత్రానికి మంచి క్రేజ్ ఉంది. తెలుగు వెర్షన్ థియేట్రికల్ రైట్స్ ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు 120 కోట్ల రూపాయలకు సొంతం చేసుకున్నాడు.
దీనిని బట్టీ, యాష్ కి తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎలాంటి క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఆయన త్వరలోనే ఒక డైరెక్ట్ తెలుగు సినిమా చేయబోతున్నట్టు సమాచారం. ఇది మైథాలజీ జానర్ లో తెరకెక్కే సినిమా అట. మన పురాణ ఇతి హాసాల్లో రామాయణం తీసుకున్నా, మహాభారతం తీసుకున్నా అందులోని ఏ పాత్రని అయినా పోషించగల సత్తా యాష్ లో ఉంది. ఆ కటౌట్ కూడా అలాంటిదే. ప్రస్తుతం ఆయన హిందీ ‘రామాయణం’ లో రావణాసురిడి క్యారెక్టర్ చేస్తున్నాడు. ఎన్టీఆర్ తర్వాత ఈ క్యారెక్టర్ లో మెప్పించిన హీరో మరొకరు ఇండియన్ సినీ ఇండస్ట్రీ హిస్టరీ లో ఒక్కరు కూడా లేరు. అలాంటి పాత్రని ఎంచుకున్న యాష్, తెలుగు మైథాలజీ మూవీలో ఎలాంటి పాత్ర చేయబోతున్నాడు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.
ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే బయటకు రాబోతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశాలు ఉన్నాయట. పాన్ ఇండియన్ స్టార్ డైరెక్టర్స్ లో ఒకరు ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారని టాక్. బహుశా రాజమౌళి తదుపరి చిత్రం యాష్ తోనే అయ్యుండొచ్చని అంటున్నారు. ఫక్తు తెలుగు సినిమాగా తెరకెక్కే ఈ చిత్రాన్ని ఇతర భాషల్లో కూడా దబ్ చేసి విడుదల చేస్తారట. ఇక ‘టాక్సిక్’ విషయానికి వస్తే , ఈ చిత్రం మార్చి 19 న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ‘ధురంధర్ 2’ తో పోటీ పడబోతోంది. చాలా మంది ఈ చిత్రాన్ని మార్చి 19 న విడుదల అవ్వడం కష్టమే అని అనుకున్నారు. కానీ మేకర్స్ రీసెంట్ గా కూడా విడుదల తేదీలో ఎలాంటి మార్పు లేదని చెప్పడంతో, ఈ చిత్రం మార్చి 19 న విడుదల అవ్వడం లాంఛనమే అనే విషయం స్పష్టమైంది.